పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. అపోస్తలులు వారి అనుయాయులు తమ పవిత్రాధికారాన్ని ఇతరులకు అందించారు.

అపోస్తలులను మొదట క్రీస్తే ఎన్నుకొన్నాడు. ఈ యపోస్తలులు తమ అనుయాయులను తామే ఎన్నుకొన్నారు. ఈ యనుయాయులు మళ్ళా తమ అనుయాయులను ఎన్నుకొన్నారు. ఈవిధంగా యాజకత్వం అపోస్తలుల నుండి శిష్యులకూ, ఆ శిష్యులనుండి వారి శిష్యులకూ సంక్రమిస్తూ వచ్చింది.

ఉదాహరణకు పౌలు తిమోతిమిద చేతులుచాచి ప్రార్థన చేయగా అతడు పర్యవేక్షకుడు (అధ్యక్షుడు) అయ్యాడు-1తిమో 4,14 ; 2తిమో 1,6. పూర్వం మోషే యోషువా విూద హస్తనిక్షేపణం చేయగా మోషే ఆత్మ యోషువా మిూదికి దిగివచ్చింది - సంఖ్యా 27, 18-23. అలాగే ఇక్కడ పౌలు మరియు ఇతర పెద్దలనుండి పవిత్రాత్మ వరప్రసాదం తిమోతిమిూదికి దిగివచ్చాయి అనుకోవాలి.

పర్యవేక్షకుడైన తిమోతి తాను మరల ఇతరులమిద హస్తనిక్షేపణంచేసి వాళ్ళను పెద్దలను చేసాడు -1తిమొు 5,22. ఈలా పవిత్రాధికారం అపోస్తలుల నుండి శిష్యులకూ, వారి నుండి వారి శిష్యులకూ సాగిపోయింది.

4. రెండవ శతాబ్దానికల్లా 현 పర్యవేక్షకులు నేటి బిషప్పలుగా మారిపోయారు.

మొదటి శతాబ్దంలో పెద్దలకూ పర్యవేక్షకులకూ వున్న వ్యత్యాసమేమిటో మనకు స్పష్టంగా తెలియదు. కాని రెండవ శతాబ్దంలో పెద్దమార్పు జరిగింది. పర్యవేక్షకులు పెద్దలకు పై యధికారులయ్యారు.

రెండవ శతాబ్దంలో జీవించిన రోమాపురి క్లెమెంటు, అంటియోకయ ఇన్యాశివారు, ఇరెనేయస్, పొలికార్పు, హిప్పొలీటస్ మొదలైన వారి రచనల వలన మనకు ఈ వివరం తెలుస్తూంది.

పైన మనం పేర్కొన్న పర్యవేక్షకులు రెండవ శతాబ్దంలో బిషప్పలుగా మారిపోయారన్నాం. ఈ బిషప్పలు పూర్వంవలె క్రైస్తవ సమాజాలన్నిటిలోను పర్యటించి పనిచేయడం మానుకొని, ఒక్క ప్రాంతానికి అధికారులయ్యారు. ఉదాహరణకు ఇగ్నేష్యస్ సిరియాకు, పోలికార్పు స్మిర్నాకు, ఇరెనేయుస్ లియోనుకు అధికారులయ్యారు. ఈ బిషప్పల క్రింద కొందరు పెద్దలు బిషప్పలతో కూడి పనిచేసేవాళ్ళు ఈ బిషప్పలు అపోస్తలులకు ప్రత్యక్షమైన అనుయాయులు. ఈ యనుయాయిత్వం చాల ముఖ్యమైంది. ఈ బిషప్పలు ఇతర బిషప్పలనూ పెద్దలనూ అభిషేకించారు.