పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. గురుపట్టం

బైబులు భాష్యం -77

విషయసూచిక

1.అపోస్తలుల కాలంనాటి యాజకులు

2.క్రీస్తే స్వయంగా యాజకత్వాన్ని స్థాపించాడు

3.గురుపట్ట సంజ్ఞలు

4.గురుపట్ట ఫలితాలు

1. అపోస్తలుల కాలంనాటి యాజకులు

ఈ యధ్యాయంలో నాల్గంశాలు పరిశీలిద్దాం

1. అపోస్తలుల కాలంలోనే త్రివిధ యాజకులు ఉండేవాళ్ళం

1. దివ్యసత్ర్పసాదాన్ని సిద్ధంచేయడానికి క్రీస్తు నుండి మొదట అనుమతి పొందినవాళ్ళు అపోస్తలులే. ప్రభువు తొలిసారిగా వాళ్లతో దీన్ని నా జ్ఞాపకార్థం చేయండి అని చెప్పాడు — లూకా 22, 19. క్రీస్తుకిమల్లె అతని శిష్యులైన అపోస్తలులకూ త్రివిధాధికారాలు వుండేవి. అవి ప్రజలను పరిపాలించడం, వారికి బోధ చేయడం, వారిని పవిత్రపరచడం.

అపోస్తలుడు అంటే యెవడు? అతడు క్రీస్తు ఎన్నుకొనిన పండ్రెండుమంది శిష్యుల్లో ఒకడు. లేదా, క్రీస్తు తన ఉత్థానంతరం స్వయంగా నియమించినవాడు కావచ్చు. పౌలు ఈలాంటివాడు. పండ్రెండుమంది శిష్యులు తమ స్థానాన్ని పూరించడానికి ఎన్నుకొన్నవాడు కావచ్చు. మత్తీయా ఈలాంటివాడు. అపోస్తలులచేత నియమింపబడిన తీతులాంటి శిష్యులుకూడ కావచ్చు. అపోస్తలుల మరణానంతరం వారి స్థానాన్ని పొందిన అనుయాయులు కూడ కావచ్చు. అపోస్తలులుకాని వారి అనుయాయులు కాని ఒక్క ప్రాంతపు తిరుసభకు చెందినవాళ్లుకాదు. వాళ్ళ నిరంతరం పర్యటిస్తూ, ఆయా ప్రాంతాల్లోని క్రైస్తవ సమాజాలన్నిటినీ పర్యవేక్షిస్తుండేవాళ్ళు.

ఈ యపోస్తలులతోపాటు వారి కాలంలోనే క్రైస్తవ సమాజంలో ఇంకా మూడురకాల అధికారులుకూడ వుండేవాళ్లు. వీళ్లే పెద్దలు, పర్యవేక్షకులు, పరిచారకులు. ఇక్కడ ఈ మూడు తెగలవాళ్లను గూర్చి పరిశీలిద్దాం.