పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రధానంగా వాళ్ళకు వర్తిస్తుంది - ఆది 1,28. వాళ్ళది ప్రధానంగా ప్రవృత్తి మార్గం. అనగా ఈలోక విషయాల్లో మునిగి వుండడం. వివాహ పావిత్ర్యం భార్యాభర్తలు ఇద్దరు కలసి సాధించేది. లైంగికమైంది. ఐనా శారీరక వ్యామోహాలను జయించేది. క్రీస్తు వరప్రసాదం ద్వారా జంతుప్రేమను దివ్యప్రేమగా మార్చుకొనేది సంతానంవైపు దృష్టి సారించేది. కుటుంబగతమైది. సామూహికమైంది. క్రీస్తు మనుష్యావతారమెత్తి ఈ భౌతిక ప్రపంచాన్ని పునీతం చేసాడు. వివాహ పావిత్ర్యం ప్రధానంగా ఈ భౌతికలోకానికి చెందింది.

ప్రార్ధనా భావాలు

1. వివాహం గొప్పతనం

రెండవ శతాబ్దంలో జీవించిన టెర్టూలియన్ అనే వేదశాస్త్రి పెండ్లిని మెచ్చుకుంటూ ఈలా వ్రాసాడు. "వివాహం ఔన్నత్యాన్ని ఏనాడూ చాలినంతగా కొనియాడలేం. తిరుసభ ఆ సంస్కారాన్ని జరిపిస్తుంది. పూజబలి ఈ దేవ ద్రవ్యానుమానాన్ని ధ్రువపరుస్తుంది. గురువు వధూవరులను ප්‍රජිරිඳධබ්දක. వివాహ సాంగ్యంలో దేవదూతలే సాక్షులుగా నిల్చివుంటారు. పరలోకంలోని పితే వివాహాన్ని స్థిరపరుస్తాడు." ఇవి ప్రేరణం పుట్టించే వాక్యాలు కదా!

2. వివాహం తక్కువది కాదు

4వ శతాబ్దంలో మానిక్కీయులనే పతితవాదులు వివాహాన్ని ఈసడించుకొన్నారు. అది కేవలం శరీరానికి సంబంధించింది కనుక నికృష్టమైంది అన్నారు. జీవమిచ్చేది ఆత్మ శరీరం నిప్రయోజనమైంది - యోహా 6,63. రక్తమాంసాలు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు - 1కొ 15,50 మొదలైన వాక్యాలను ఉదహరించి వాళ్ళు పెండ్లిచెడ్డదని వాదించారు. కాని ఇది పొరపాటు, క్రీస్తు శరీరధారియై మన శరీరాన్ని పవిత్రం జేసాడు. వివాహ సంస్కారం క్రీస్తు మనుష్యావతారంమీద ఆధారపడి పనిచేస్తుంది. 5. తిరుకుటుంబం మరియూ యోసేపుల వివాహం పరమ పవిత్రమైంది. దానిలో లైంగిక ప్రక్రియమాత్రం లేదు. మరియ గర్భాన క్రీస్తు జన్మించడం పవిత్రకార్యం. తిరుకుటుంబం ఎల్లప్పడు మన Sšiš కుటుంబాలకు ఆదర్శంగా వుండాలి 4.పెండ్లి వంగరం

పదియవ భక్తినాథ పాపగారు అర్చ్యశిష్ణులు. ఆయన ఒకసారి తనచేతి వంగరాన్ని తల్లికి చూపించి అమ్మా! నీవు ఈ వంగరం ఘనతను గుర్తించావా అని అడిగాడు. 48