పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొరపెట్టుకొంది - ఆది 30,1. బిడ్డలు కలిగాక ఆమె దేవుడు నా అవమానాన్ని తొలగించాడని సంతోషించింది-30,28. నేటి తల్లిదండ్రులు బిడ్డల పుట్టువును అంగీకరించకపోవడం శోచనీయం.

3. దైవ సహాయం

వివాహ పూజలో వచ్చే ఓ ప్రార్ధన యిది. ఇది దంపతులకు ప్రేరణం పట్టిస్తుంది. "సృష్టికర్తవైన సర్వేశ్వరా! పరిశుద్దుడవైన పితా! నీవు స్త్రీ పురుషులను నీకు పోలికగా జేసావు. వివాహ జీవితాన్ని ఆశీర్వదించేవాడివి నీవే. ఈ దినం వివాహ సంస్కారంద్వారా తన భర్తతో ఐక్యమైన ఈ వధువు కొరకు మేము నీకు ప్రార్థన చేస్తున్నాం. నీవు ఈమెను ఈమె భర్తను మెండుగా దీవించు. నీవు దయచేసే వివాహ ప్రేమయందు వీళ్ళిద్దరు ఆనందింతురుగాక. వీరు తమ బిడ్డలద్వారా తిరుసభను వృద్ధిలోకి తెత్తురుగాక, ప్రభూ! ఈ దంపతుల సౌఖ్య0లో నిన్నుస్తుతింతురుగాక. దుఃఖంలో నీకు మొరపెట్టుకొందురుగాక. వీళ్ళు తమ పనిలో నీవు సాయపడతావనియు, తమ అవసరాల్లో నీవు తమ్ము ఆదుకొంటావనియు గ్రహించి సంతోషింతురుగాక. తిరుసభతో ఐక్యమై నీకు ప్రార్ధన చేయుదురుగాక. ఈ లోకంలో నీకు సాక్షులుగా వుందురుగాక. తమ స్నేహితులతో కలసి వృద్ధాప్యంవరకు జీవింతురుగాక. కడన నీరాజ్యంలో ప్రవేశింతురుగాక. మా ప్రభువైన క్రీస్తుద్వారా ఈ మనవిని ఆలించండి, ఆమెన్."

7. ప్రేమ మార్గం

ఆధ్యాత్మికంగా జూస్తే వివాహితులకు మూడు ప్రధాన మార్గాలు ఉన్నాయి. అవి ప్రేమ, సిలువ, భక్తి మార్గాలు. ఈ మూడు మార్గాలను మూడధ్యాయాల్లో పరిశీలించి చూద్దాం.

1. వివాహం జీవితంగూడ పవిత్రమైందే

సన్యాసజీవితంలాగే వివాహజీవితంగూడ ప్రత్యేకత కలది. అదికూడ పిలుపే. వివాహితులుకూడా ప్రత్యేకమైన ఆధ్యాత్మికజీవితం గడపాలి. ఇంతవరకు సంసారజీవితం అంత శ్రేష్టమైంది కాదు అనే అభిప్రాయం ప్రచారంలోవుంది. కాని అది పొరపాటు, గృహస్థజీవితం కూడ ఆధ్యాత్మికమైందే.

వివాహితులు తమ పిలుపులోని ఔన్నత్యాన్ని చక్కగా అర్థంచేసికోవాలి. సంసారజీవితం ద్వారాగూడ క్రీస్తు మరణోత్దానాలు తిరుసభలో కొనసాగుతాయి. ఇక్కడ