పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పఠనం ప్రారంభించాడు. ఈయన రెండవ శతాబ్దిలో వేదసాక్షిగా మరణించాడు. సత్సంభాషణం ద్వారా దివ్యాత్ముడు మన హృదయంలో మాట్లాడుతూంటాడు. ప్రబోధం కలిగిస్తుంటాడు.

సంఘటనలు:

పేత్రు క్రీస్తు నెరుగనని మూడుసార్లు బొంకాడు. ఆ ప్రభువు అతనివైపు జాలితో చూచాడు. పేత్రు తన తప్పను తెలిసికొని పశ్చాత్తాపంతో బోరున యేడ్చాడు -లూకా 22,62, ఫ్రాన్సిస్ ಬೌದ್ದಿಯಾ అను నాతడు కూడ భార్య మరణం కారణంగా జేసుసభలో చేరి గొప్ప భక్తుడయ్యాడు. ఈలాగే జీవితంలోని రకరకాల సంఘటనలు మనకు వరప్రసాదాన్నిస్తూంటాయి.

కుటుంబం:

భక్తురాలగు మోనీక తన భర్త పెట్రీష్యస్ పరివర్తనానికి, కుమారుడు ఆగస్టీను పరివర్తనానికి కారకురాలైంది. రోమను సామ్రాజ్యమునందలి క్రైస్తవ వనితలు చాలమంది తమ భర్తలు జ్ఞానస్నానం పొందడానికి కారకురాళ్ళయ్యారని వేదసాక్షుల చరిత్రలు చెపూంటాయి. ఈలా కుటుం జీవితంలో ఓ వ్యక్తి మరోవ్యక్తికి వరప్రసాద కారణం కావచ్చు.

ఈలా జీవితంలో ఆయా సన్నివేశాలు ఆయా వ్యక్తులూ మనకు వరప్రసాద కారకులౌతూంటారు. అందుకే పౌలు "దేవుణ్ణి ప్రేమించేవాళ్ళకి అన్నీ మంచినే చేస్తాయి” అని వాకొన్నాడు - రోమా 9, 28.

2. అన్యప్రయోజక వరప్రసాదం

ఇంతవరకు నాలు రకాల సహాయక వరప్రసాదాలను చూచాం. ఇవన్నీస్వీయ ప్రయోజనం కొరకు ఉద్దేశింపబడ్డాయి. ఇవిగాక అన్యప్రయోజనం కొరకు ఉద్దేశింపబడిన సహాయక వరప్రసాదాలూ వున్నాయి. అనగా ఇవి తనకుగాక ఇతరులకు ఉపయోగపడుతుంటాయి.

ఇవీ చాలా వున్నాయి. కొన్ని విశ్వాసుల సమాజం కోసం ఉద్దేశింపబడ్డాయి. దివ్యప్రేరణం ఈలాంటిదే. దీనిద్వారా పరిశుద్ధ రచయితలు బైబులు గ్రంథాలను వ్రాసి విశ్వాసుల కందరకూ మేలు చేకూర్చారు. భగవంతుడు అనుగ్రహించే దర్శనాలూ ఈలాంటివే. శ్రీ హృదయ దర్శనాలకు పాత్రురాలైన మర్గరీత మరియు క్రైస్తవ ప్రజలకందరకును దివ్య ప్రేమను చాటి చెప్పగల్లింది. పౌలు తన గ్రంథాల్లో పేర్కొనిన దైవవరాలూ ఈలాంటివే - 1కొ 12, 7-11. అన్యభాషల్లో మాటలాడ్డం, ప్రవచించడం, ఉపన్యసించడం మొదలుగా గల ఈ వరాలు ముప్పెదాకా వున్నాయి. శ్రీసభ తొలినాళ్లలో ఈ వరాలు బహుళ ప్రచారంలో వుండేవి. ఇవన్నీ జ్ఞానదేహం పెంపుకోసమ ఉద్దేశింపబడ్డాయి - ఎఫే 4, 13.