పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపోస్తలుల బోధలు విని ఆ రోజే 3000 మంది క్రీస్తును విశ్వసించారు, జ్ఞానస్నానం పొందారు - అచ. 2, 42. వీటన్నిటికీ కారణం ఒక్కటే : పరిశుద్ధాత్మ. ఆ యాత్మే శిష్యులను పూర్తిగా మార్చివేసింది. ఆత్మ అనుగ్రహించినపుడు మనకూ క్రీస్తు క్రొత్తగా కనుపిస్తాడు. క్రీస్తుకోసం దీక్షతో పని చేస్తాం.

5. ప్రభువు ఆత్మనే శిష్యులూ పొందారు - అచ. 2, 33.

ప్రభువు తండ్రినుండి పరిశుద్ధాత్మను పొందాడు. ఈ పరిశుద్దాత్మ ద్వారానే ప్రభువు మృతదేహం మళ్ళా జీవించింది. ప్రభువు మహిమను పొందిందికూడా ఈ యాత్మ ద్వారానే. ఇక తాను స్వీకరించిన ఆత్మను శిష్యులకు గూడ అనుగ్రహించాడు. అందుకే నేను వెళ్లిన తరువాత ఆదరణ కర్తను పంపిస్తాను" అన్నాడు క్రీస్తు. ప్రభువు ప్రసాదించే ఈ యాత్మ ఆ ప్రొలినాటి శిష్యులకే గాదు మనకూ లభిస్తుంది. జ్ఞానస్నానం పుచ్చుకునేపుడే మనమూ ఆత్మను పొందుతాం. జ్ఞానస్నానం వలన కలిగే ఫలితాలు రెండు : పాప క్షమాపణ0, ఆత్మ స్వీకారం - అ,చ. 2, 38. మనమూ ప్రభువు ఆత్మను పొందాం. ప్రభులోనికి ఐక్యమయ్యాం. ఈ సత్యాన్ని ఎప్పడూ మరచిపోకూడదు.

6.ఆత్మ శిష్యులను నడిపిస్తుంది - అ,చ, 13, 2-4

అంతియోకయ పట్టణంలో ఓ చిన్న క్రైస్తవ సమాజం ఏర్పడింది. పౌలు బర్నబా మొదలైన శిష్యులు ఈ సమాజానికి చెందినవాళ్ళు. ఇంతవరకూ వీళ్లంతా విశేషంగా యూదులకే క్రీస్తును బోధిస్తూండేవాళ్లు, కాని పవిత్రాత్మ ఇకమీదట గ్రీకు ప్రజలకుగూడ క్రీస్తును బోధించాలని సంకల్పించుకుంది. పౌలును బర్నబాను ఈ పనికి ఎన్నుకుంది. వాళ్లిద్దరిని తానే స్వయంగా నడిపించుకొని పోయింది. పౌలు బర్నబా రోమను సామ్రాజ్యంలోని గ్రీకు రాష్ట్రాలకు ప్రయాణమై పోయారు. ఆసియా అనే రాష్ట్రంలో క్రీస్తును బోధిద్దామనుకొని పని ప్రారంభించారు. కాని ఆత్మ వాళ్ళను హెచ్చరిస్తూ మాసెడోనియాకు వెళ్లమంది. ఆత్మ నాయకత్వం క్రింద పౌలు బర్నబా మాసెడోనియాకు ప్రయాణమై పోయారు. అచ. 16, 6-10. మనహృదయాల్లో పుట్టే మంచి కోరికలు ఆత్మవలన కలుగుతూవుంటాయి. మనం పదిమందికి ఉపయోగపడే మంచి పనిని ప్రారంభించేలా చేసేదిగూడ ఈ యాత్మే

7.ఆత్మ నిర్ణయాలు = అ చ. 15,28.

యెరూషలేంలోని తొలినాటి క్రైస్తవ సమాజంలో కొన్ని భేదాభిప్రాయాలు పొడచూపాయి. అంచేత పేత్రు పౌలు యెరూషలేంలో ఓ పెద్ద సమావేశం ఏర్పాటు 146