పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తర్వాత అతడు శాశ్వత తేజస్సును పొందుతాడు. ఈ ప్రస్వకాలిక తేజస్సు ఆ శాశ్వతకాలిక తేజస్సుకి సూచనం

పూర్వం మోషే సీనాయి కొండమీదికి ఎక్కిపోయినపుడు ప్రభువు సాన్నిధ్య ప్రభావంవల్ల అతని ముఖం ప్రకాశించింది - నిర్గ 34,29. క్రీస్తు నూత్న మోషే కనుక ఆ మోషే ముఖంలాగ ఇక్కడ క్రీస్తు ముఖంకూడ కొండమీద ప్రకాశించింది.

2. క్రీస్తు దివ్యరూపధారణం శిష్యులకు ప్రోత్సాహకరంగా వుంటుందికూడ. ఈ సంఘటనం ముగిసిన కొలదినాళ్ళకే క్రీస్తు సిలువ మరణం వస్తుంది. ఈ సిలువ మరణానికి శిష్యులు సంసిద్ధంగా ඒජා. వాళ్ళు ఆ ఫబోర సంఘటనను జూచి భయపడి ధైర్యాన్ని కోల్పోతారు. వాళ్ళ విశ్వాసం చలిస్తుంది. కాని ఆ విషమసమయంలో వాళ్లు ప్రభువు దివ్యరూపధారణాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని ధైర్యం చెందవచ్చు. సిలువ మరణం అతన్ని నాశం చేయలేదనీ, అతడు కొండమీద ప్రదర్శించిన దివ్యత్వం అతనికి మళ్ళా ఉత్తాన విజయాన్ని చేకూర్చిపెడుతుందనీ గ్రహించి ఊరట చెందవచ్చు. ఈ రీతిగా క్రీస్తు దివ్యరూపధారణం కల్వరిమీద నిరుత్సాహానికి గురయ్యే శిష్యులకు ప్రోత్సాహకారణమౌతుంది. ఇక, ఈ జీవితంలో నేడు మనం కష్టాలనుభవించేపుడూ, క్రీస్తుని శంకించేపుడూ అతని దివ్యరూపం మన విశ్వాసాన్నిగూడ బలపరుస్తుంది. నా ప్రకాశాన్నిచూచి మీరు నన్ను శంకించడం మానుకొండని క్రీస్తు నేడు మనలను హెచ్చరిస్తూంటాడు- మత్త 11,6.

ప్రార్థనా భావాలు

1. కొండమీద క్రీస్తుతో మాటలాడిన మోషే యేలీయాలు ధర్మశాస్తాన్నీ ప్రవచనాలనీ సూచిస్తారని చెప్పాం. ఇవి రెండూ రానున్న క్రీస్తుకి సాక్ష్యం పలుకుతాయనిగూడ చెప్పాం. కనుకనే ఉత్థానక్రీస్తు ధర్మశాస్త్రమూ ప్రవచనాలూ తన్నుగూర్చి చెప్పిన సంగతులన్నిటిని ఎమ్మావు ప్రోవలో శిష్యులకు వివరించాడు - లూకా 24,44– 46. క్రీస్తు మొదట శ్రమలనుభవించి ఆ పిమ్మట మహిమలో ప్రవేశిస్తాడనే ఈ సంగతులన్నిటి భావం-లూకా 24,26. నేడు మనం క్రీస్తు లోనికి జ్ఞానస్నానం పొందినపడే అతని శ్రమలూ మహిమా కూడ మనమీద సోకుతాయి. ఈ లోకంలో మనమూ అతనితోపాటు వేదనలు అనుభవిస్తాం, అటుపిమ్మట అతని తేజస్సులో పాలుపొందుతాం. ఈ భావం పౌలుకి చాల ప్రీతికరమైంది. అతడు “క్రీస్తు పునరుత్థాన ప్రభావాన్ని అనుభవించాలనీ, అతని శ్రమల్లో పాల్గొనాలనీ నా కోరిక" అని వాకొన్నాడు – ఫిలి 3,10-11.