పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకటించారు - 27,54, వీళ్లు రోమియులు. కనుక అన్యజాతుల నుండి క్రీస్తుని దైవకుమారునిగా విశ్వసించినవారిలో వీళ్లే ప్రథములు. ప్రభువు సిలువపై చనిపోతూ జపించిన 22వ కీర్తన కూడ.

"లోకంలోని జాతులన్నీ ప్రభుని జ్ఞప్తికి తెచ్చుకొని అతని వద్దకు మరలివస్తాయి సకల జాతులు అతన్ని పూజిస్తాయి"

అని చెప్తుంది - 22,27.

క్రీస్తు చనిపోయినపుడు పుణ్యస్త్రీలు కూడ కల్వరిమిద ఉన్నారు. వాళ్లు కొంచెం దూరంగా నిల్చుండి క్రీస్తు మరణాన్ని తిలకించారు. ఇక్కడ వీళ్లు క్రీస్తు మరణానికి సాక్షులుగా నిలబడ్డారు అనుకోవాలి - 27,55. ఆ ప్రభువు చనిపోయినపుడు యోహాను తప్ప మిగతా శిష్యులెవరూ దగ్గరలేరు. వాళ్లంతా భయపడి పారిపోయారు. మగవాళ్లు అలా పారిపోతే ఈ స్త్రీలు మాత్రం ధైర్యంతో భక్తిభావంతో ప్రభువుకి అంటిపెట్టుకొని వుండిపోయారు. వాళ్ళ విశ్వాసం మనకు గూడ అలవడితే ఎంత బాగుంటుంది!

7. భూస్థాపనం, కాపలా

క్రీస్తు శుక్రవారం సాయంత్రం మూడుగంటల వేళ చనిపోయాడు. అదే రోజు సాయంత్రం అరుగంటల నుండి విశ్రాంతి దినమైన శనివారం ప్రారంభమౌతుంది. యూదులు శనివారం ఏపనీ చేయరు. కనుక ప్రభువు శవాన్ని త్వరగా భూస్థాపనం చేయాలి.పైగా ధర్మశాస్త్రం ప్రకారం, కోరతవేసిన ద్రోహుల్ని ఆరోజు పగలే పాతిపెట్టాలి. 'ఉరితీసిన శవాన్ని రేయి చెట్టు విూద ఉండనీయరాదు, ఆ దినమే పాతిపెట్టాలి" - ద్వితీ 21,22.

యోసేపు- 27,57-61

కనుక క్రీస్తుని అన్ని విధాల త్వరగా పూడ్చిపెట్టాలి. కాని యొక్కడ? క్రీస్తు బంధువులు శిష్యులు అంతా గలిలయ నివాసులు. వాళ్ళకు యెరూషలేములో స్థలమేమి లేదు. కనుక క్రీస్తుని ఎక్కడ పాతిపెట్టాలన్న సమస్య ఎదురైంది. అప్పడు అరిమతయియ యోసేపు ముందుకివచ్చి క్రీస్తు భూస్థాపన బాధ్యతను చేపట్టాడు - 27,57.

ఈ యోసేపు ఉదంతం సువార్తలో ఇక్కడ మాత్రమే వస్తుంది. అతడు దిడీలున వచ్చి క్రీస్తుని పూడ్చిపెట్టి మళ్లా దిడీలున తెరమరుగైపోయాడు.

ఈ యోసేపు క్రీస్తు "శిష్యుడు". మత్తయి సువిశేషంలో శిష్యుడు అంటే కేవలం మాటలు మాత్రమే చెప్పక సత్ర్కియలు చేసి చూపించేవాడు. ఇక్కడ యోసేపు చేసిన