పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరియామార్తల కథకూడ ఈ సత్యాన్నే బోధిస్తుంది. మార్త ప్రభువుకి ఏలా భోజనం సిద్ధంచేయాలా అని చింతించసాగింది. కనుకనే క్రీస్తు ఆమెను నీవు ఎన్నో పనులను గూర్చి విచారిస్తున్నావని మందలించాడు - లూకా 10,41. మరియకు ఈ విచారం లేదు. ఆమె స్త్రిమితంగా ప్రభువు పాదాల చెంత కూర్చుండి అతని వాక్కుని ఆలించింది. ఆ వాక్కునే శరణుజొచ్చింది. ఆమె సంపద ఆవాక్కే కనుకనే మరియ హృదయం ఆవాక్కు మీదనే నిల్పింది - లూకా 10,29. శిష్యుడు ఈ మార్తలాగ ఆందోళనపడకూడదు. ఈ మరియలాగ ప్రభువుని నమ్ముకొని నిర్విచారుడై యుండాలి.

7. సోదరప్రేమను పాటించాలి

సోదరప్రేమను పాటించడంగూడ శిష్యధర్మాల్లో ఒకటి. మనం తెలియక ఇతరులను తీర్మానిస్తాం. మన లోపాలను ఆలావుంచుకొని ఇతరుల లోపాలను ఎత్తి చూపిస్తాం. ఇది వట్టి అజ్ఞానం. మనకంటిలోని దూలాన్ని చూడకుండ ఇతరుల కంటిలోని నలుసుని చూడ్డం వట్టి అవివేకం. మనం ఇతరులకు ఏ కొలతన కొలుస్తామో దేవుడుకూడ మనకు అదే కొలతన కొలుస్తాడని గుర్తుంచుకోవాలి - మత్త 7, 1-5.

ఈ సందర్భంలోనే ప్రభువు బంగారుసూత్రం ఒకటి చెప్పాడు. అది "ఇతరులు మీకేమి చేయగోరుతారో మీరూ ఇతరులకు అదిచేయండి” అనే వాక్యం - 7, 12. మామూలుగా ఇతరులు మనకేమి చేయగోరుతాం? వాళ్ళ మనకు కీడుగాదు ఉపకారం చేయాలని ఆశిస్తాం. మనలను గూర్చి చెడ్డగాగాకుండ మంచిగా మాట్లాడాలని కోరుతాం. మన అక్కరలో మనలను ఆదుకోవాలనుకొంటాం. మనపట్ల ఆదరమూ ఆప్యాయతా చూపాలనుకొంటాం, ఇతరులపట్ల మనంకూడ ఈలాగే మెలగాలి. “ఆత్మాపమ్యేన సర్వభూతేషు దయాం కుర్వంతి సాధవః" అంటుంది ఓ సంస్కృత సామెత. అనగా సాధుమతులు అన్ని ప్రాణులూ తమలాంటివేకదా అనుకొని వాటిపట్ల దయజూపుతూంటారు అని భావం. ఇదే సోదరప్రేమ, మోషే ఆజ్ఞలూ, ప్రవక్తల బోధలూ, క్రీస్తు సూత్రాలూ అన్నీ ఈ ప్రేమాజ్ఞలోనే యిమిడివున్నాయి. కనుక ఈ సోదరప్రేమను పాటించేవాడే శిష్యుడు.

8. ఆచరణశుద్ధి

శిష్యుడు మాటలతో కాలం వెళ్ళబుచ్చగూడదు. ఆతనిలో ఆచరణశుద్ధి వుండాలి. ఈ యూచరణ శుద్ధిని గూర్చి ప్రభువు నాలు సంగతులు చెప్పాడు. వాటిని క్రమంగా పరిశీలిద్దాం.

1. రెండు మార్గాలున్నాయి. ఒకటి ఇరుకైందీ, మరొకటి విశాలమైందీ. శిష్యుడు ఇరుకుమార్గంలో పయనించాలిగాని విశాలమైనదానిలో కాదు. "నీతిమంతులమార్గం ప్రభువుకి