పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. కొన్నిసార్లు జీవితంలో పెద్ద కష్టాలొస్తాయి. అప్పడు నేనింత మంచివాడ్డి, ఇతరుల్లాగ పాడుపనులు చేయను, దేవుడు నాకు ఈ కష్టాలు ఎందుకు పంపాడు అనుకొంటాం, ఇంకా కొన్నిసార్లు మనకు అతినమ్మకం కలిగినపుడు మనలను మనమే పొగిడేసుకొంటాం. ఈ సందర్భాల్లో అచ్చంగా ఆ పరిసయునిలాగే ప్రవర్తిస్తున్నాం అనుకోవాలి.

5. పరిసయుడు సుంకరిని ఖండించాడు. నరుల తప్పలను ఖండించినా నరులను తేలికగా ఖండించకూడదు. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఆ తప్పలను చేస్తున్నారో మనకు తెలియదు, దేవునికి తెలుసు.

6. ఈ కథలోని ప్రధానాంశం దేవుని కరుణ, సుంకరి నిజంగా పాపే, కాని అతని పశ్చాత్తాపాన్ని చూచి దేవుడు అతన్ని కరుణతో ఆదరించాడు. దేవుని జాలిగుండె వలన మనం పాపక్షమాపణ పొంది బ్రతికిపోతున్నాం. మంచి పశ్చాత్తాపం అవసరం.

3. మార్కు ఉపమానాలు

33. తనంతట తానే పండిన పంట - మార్కు 426–29

1. భూమి రైతు జోక్యం లేకుండ తనంతట తానే పైరును క్రమేణ పంటకు తెస్తుంది. ఆలాగే దేవుడు తన సొంతశక్తితోనే, తానుకోరుకొన్న కాలంలోనే, నరుని జోక్యం లేకుండానే, దైవరాజ్యాన్ని నెలకొల్పుతాడు.

2. క్రీస్తు నాడు “ఉత్సాహవాదులు" హింసకు పూనుకొని రోముపై తిరుగుబాటుచేసి దైవరాజ్యాన్ని స్థాపించాలి అనుకొంటున్నారు. "దర్శనవాదులు" దైవరాజ్యం ఎప్పడు, ఎక్కడ నెలకొనేది లెక్కలు వేసి చెపున్నారు. పరిసయులు ధర్మశాస్త్రన్ని నిష్టతో పాటిస్తే దైవరాజ్యం వస్తుంది అంటున్నారు. క్రీస్తు దృష్టిలో మాత్రం దైవరాజ్యాన్ని స్థాపించడం మనపనికాదు, దేవునిపని. మనం విత్తనం మొలకెత్తి పంట పండిందాకా ఓపికతో వేచివుండవలసిందే.

3. ఆధునిక మానవుడు అంతా తానే చేయాలి, తానే ఫలితాలు సాధించాలి, తానే అన్నిటినీ అదుపులో పెట్టుకోవాలి అనుకొంటాడు. తొందరపడతాడు. విశ్రాంతి లేకుండ పనిచేస్తాడు. కాని ప్రణాళికలు వేసేవాడు, ఫలితాలు సాధించేవాడు దేవుడే అన్న సంగతి మరచిపోతాడు. క్రీస్తు లోకాన్ని రక్షించడానికి వచ్చినా అన్ని కార్యాలు తండ్రికి వదలివేసి తాను నెమ్మదిగా కదిలాడు. చిన్నపిల్లలను ఆహ్వానించడం, ప్రకృతిని పరిశీలించడం, ప్రార్థన చేసికోవడం, వివాహాలకూ విందులకూ హాజరు కావడం మొదలైన