పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిలువన ఎండిపోయింది. ఇక్కడ క్రీస్తు ఉద్దేశం ఈ యంజూరం ఎండిపోవాలని మాత్రమే గాదు. ఈ చెట్టు యూదప్రజలకు సంకేతం. దాని విూద పండ్లలేవు. అలాగే యిస్రాయేలు ప్రజల్లో గూడ పశ్చాత్తాపఫలాలు లేవు. క్రీస్తు ఎంత బోధించినా వాళ్ళకు పరివర్తనం కలగడం లేదు. ఆ ప్రజలు తండ్రి శాపానికి చిక్కి వ్రుగ్గిపోనున్నారు. ఈ యెండిపోయిన చెట్టులాగే వాళ్లు కూడ నాశమై పోతారు - ఇది భావం. కనుక యేసు ఇక్కడ ఈ వృక్ష శాపరూపంలో యూదుల వినాశాన్ని నటన చేసి చూపించాడు.

ఈలాంటి నటనాత్మకమైన సామెతలు క్రీస్తు జీవితంలో ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ సామెతలన్నీ గూడ దైవరాజ్యం సమిూపించిందని తెలియచేస్తాయి. ఇక్కడ క్రీస్తు దైవరాజ్యాన్ని గూర్చి కొన్ని సామెతల ద్వారా బోధించడం మాత్రమే గాదు, తన జీవితం ద్వారా గూడ బోధించాడు. అసలు అతడే దైవరాజ్యం.

8. క్రీస్తు శ్రమలను గూర్చిన సామెతలు

క్రీస్తు సామెతల్లో కొన్ని ఆ ప్రభువు సిలువ మరణాన్ని సూచిస్తాయి. అతని పాటులను తలపింపజేస్తాయి. ఈ వర్గం సామెతలన్నీ విస్తృతి చెందక కేవలం ఉపమాన వాక్యాల్లా నిల్చిపోయాయి. ఈలాంటివాటిని ఓ నాల్డింటిని మాత్రం ఇక్కడ పరిశీలిద్దాం.

1. నక్కలకు బొరియలూ ఆకాశపక్షులకు గూళ్ళూ ఉన్నాయి గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనే తావైనా లేదు - మత్త 8,20. వన్యమృగాలకూ పక్షులకూ స్థిరనివాసాలున్నాయి గాని క్రీస్తుకిస్థిరనివాసమంటూ లేదు. అతడు ఎప్పుడూ దేశద్రిమ్మరిగా తిరిగేవాడు. అనగా మెస్సీయా సుఖాలనుభవించే వాడు కాదు. కష్టాలూ శ్రమలూ అతని పాలు అని భావం.

2. క్రీస్తు సిలువ మోసుకొని వెళూంటూ యెరూషలేము పుణ్యస్త్రీలు అతని కెదురువచ్చి సంతాపం తెలియజేసారు. ఆ సందర్భంలో ప్రభువు వచ్చి ప్రమానికే ఈలాంటి గతి పట్టినపుడు ఇక ఎండుమ్రానికి ఏలాంటి గతి పడుతుందో ఊహించండి అన్నాడు - లూకా 23,31.

ఇక్కడ పచ్చి మ్రాను అంటే నిర్దోషియైన క్రీస్తు. ఎండుమ్రాను అంటే పాపపు యూదజాతి. నిర్దోషియైన క్రీస్తుకే ఈలాంటి ఫరోర శ్రమలు ప్రాప్తించాయి. ఇక దుర్మార్ణులైన యూదప్రజలలకు ఏలాంటి విపత్తులు సంభవిస్తాయో ఊహించండి అని భావం. క్రీస్తు తర్వాత 70వ సంవత్సరంలో టైటస్ అనే రోమను సైన్యాధిపతి యెరుషలేమను ముట్టడించి సర్వనాశం చేసాడు. రోమను సైన్యం పురజనులను కూరగాయల్లాగ తరిగివేసింది. అప్పుడు ఈ వాక్యం అక్షరాల నెరవేరింది.