పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. అన్యాయార్జితమైన విత్తం కీడు తెచ్చిపెడుతుంది

పూర్వాంశంలో సాత్తు అతి శ్రేష్టమైన భాగ్యం కాదనీ, వివేకం హృదయశాంతి మొదలైనవి దానికంటె గొప్ప వరాలు అనీ చెప్పాం. ఐనా డబ్బుకుండే విలువ వుండనే వుంది. దేవుడేమో తన భక్తులకు సిరిసంపదలు ఇస్తూనే వుంటాడు. కాని సిరిసంపదలు కలవాళ్ళంతా దైవభక్తులై వుండనక్కరలేదు. చాలమంది అక్రమ మార్గంలో సాత్తు ప్రోగుజేసికొంటారు. ఈలా అన్యాయంగా ఆర్ధించిన విత్తం విలువ యేమిటి? దేవుడిచ్చింది కాదు కనుక అది మేలుకి మారుగా కీడు కలిగిస్తుంది.

అబద్దాలు చెప్పి ప్రోగుజేసికొన్న సొమ్ము చావును తెచ్చిపెడుతుంది - సామె 21,6. డబ్బుచేసికొనేవాడు సాంఘిక న్యాయాన్ని మరచిపోకూడదు. పొలమూపట్రా అన్నీ మనమే ఆక్రమించుకొని ఇరుగుపొరుగువాళ్ళ గాలికి పొయ్యేలా చేయగూడదు. కనుకనే యెషయా ఇంటికి యిలూ చేనికి చేనూ కలుపుకొని క్రమేణ చుట్టుపట్ల వున్న స్థలాన్నంతటినీ ఆక్రమించుకొనేవాళ్ళు శాపగ్రస్తులౌతారు" అన్నాడు - 5,8. యిర్మీయాకూడ "ధనవంతుల యిండ్లు దోపిడి సామ్ముతో నిండిపోయాయి. కనుకనే వాళ్ళు గొప్ప వాళ్ళయ్యారు, బలిసిపోయారు" అని నిందించాడు - 5,27. ధనవంతులు దౌర్జన్యపరులై పేదలను పీడించారు అని వాపోయాడు మీకాయా - 6,12.

సంపన్నులు దేవునిమీదకంటెగూడ అదనంగా డబ్బు మీద హృదయం నిల్పుకొని చెడిపోతారు. నరుడు తలదాచుకొనే కోట దేవుడైయుండాలి - కీర్త 18,2. కాని ధనవంతుడు తలదాచుకొనే కోట అతని డబ్బే ఔతుంది - సామె 10,15. ఇది విడూరంగదా! ఇంకా, వెండిబంగారాలతోను గుర్రాలు రథాలతోను నిండిపోయే దేశం క్రమేణ విగ్రహాలతో గూడ నిండిపోతుంది - యెష 2,7-8. ధనంమీద నిల్చేవాడు తప్పకుండా పడిపోతాడు - సామె 11,28. విత్తవంతులు మోషే నిబంధనను పాటించరు. మీరుతారు. ఎడారిలో ప్రజలు మస్తుగా భుజించి మదమెక్కి దేవుణ్ణి మరచిపోలేదా? - హో షేయ 13,6. ధనవంతులు దేవుని ఆజ్ఞలను పాటించలేరు, వాళ్ల కళ్లకు పొరలు కమ్ముతాయి - ద్వితీ 31,20. ఈ సందర్భంలో జ్ఞానియైన ఆగూరు ధనాన్ని మనసులో పెట్టుకొని చేసిన ప్రార్ధనం స్మరింపదగ్గది :

"ప్రభూ! నన్ను ధనికుణ్ణి చేయకు, దరిద్రుణ్ణి చేయకు
నాకు తిండికి మాత్రం లోటులేకుండా చేయి
నేను ధనవంతుణ్ణయితే పొగరెక్కి