పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4 దేవద్రవ్యానుమానాలను భక్తిగా స్వీకరించడం ద్వారా కూడ మంచి మరణానికి ఆయత్తమౌతాం. జ్ఞానస్నానం ద్వారా క్రీస్గు మరణోత్థానాల్లో పాలు పొందుతాం. ఇక్కడమనం చనిపోయేది పాపానికి, ఉత్థానమయ్యేది పుణ్య జీవితానికి, జ్ఞానస్నానంవల్ల క్రీస్తు మరణం మన చావుమీద సోకి దాన్ని పునీతం చేస్తుంది.

దివ్య సత్రసాదం మనలను క్రీస్తుతో ఐక్యం చేస్తుంది. మనకు ఉత్తానభాగ్యాన్ని దయచేస్తుంది. అది మనం మృత్యువుని జయించేలా చేస్తుంది. నన్ను భుజించినవాణ్ణి నేను అంతిమ దినాన లేపుతానని ప్రభువే చెప్పాడు - యోహా 6,44, అందుకే చనిపోయేటపుడు రోగులకు దివ్యసత్ర్పసాదాన్ని యిస్తారు. అది లోకాంతంలో మనలను పెన్నిద్దురనుండి లేపుతుంది.

పాపంవల్లనే వ్యాధిబాధలు లోకంలోకి వచ్చింది. వ్యాధి బాధను కలిగిస్తుంది. ఈ బాధవల్ల దేవునిపట్ల మమకారాన్ని ప్రేమను కోల్పోతాం. క్రీస్తు తన అద్భుతాల ద్వారా ఈ వ్యాధిబాధలను కొంతవరకు తొలగించాడు. ఇప్పడు వ్యాధిగ్రస్తుల దేవద్రవ్యానుమానం రోగంలో మనకు బలాన్నిస్తుంది. దేవునిపట్ల మన విశ్వాసం సడలకుండా వుండేలా చేస్తుంది. ఇంకా, మన మరణకాలంలో పిశాచం మనలను తీవ్రంగా శోధిస్తుంది. ఆ శోధనల్లో ఈ దేవద్ర్యానుమానం మనమీద తన ప్రభావాన్ని చూపి మనం క్రీస్తుకి అంటిపెట్టుకొని వుండేలా చేస్తుంది. కనుక మరణావస్థలో వున్నవాళ్ళ ఈ సంస్కారాన్ని తప్పక పొందాలి.

పాపసంకీర్తనం మనం పాపాలకు పరిహారంచేసే దేవద్రవ్యానుమానం. పాపం తొలగిపోయినపుడు మృత్యువు బాధ కూడ చాలవరకు తొలగిపోతుంది. ఈ దేవద్రవ్యానుమానం మనం మృత్యువుని అంగీకరించేలా చేస్తుంది. మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా చావుని స్వీకరించేలా చేస్తుంది. క్రీస్తు వరప్రసాదం మన హృదయాన్ని బాగా శుద్ధిచేసి అది మరణానికి సిద్ధపడేలా చేస్తుంది.

4. దైవార్చన - మరణం

దైవార్చన, విశేషంగా పూజ మరణంయొక్క పరమార్గాన్ని తెలియజేస్తుంది. మృతుల పూజలో వచ్చే ప్రిఫేస్ ప్రార్థనం "ఓ ప్రభూ! నీ విశ్వాసులకు ఈ జీవితం మారుతుందే కాని అంతంకాదు, ఈ భూలోక నివాసం శిథిలంగాగా మాకు పరలోక నిత్యనివాసం సిద్ధమౌతుంది" అని చెప్తుంది. ఇది చాలా గొప్ప భావం. మరణంతో మన జీవితం ముగియదు. ఇంతకంటె మెరుగైన జీవితం ప్రారంభమౌతుంది. క్షణికమైన భూలోక జీవితంపోయి శాశ్వతమైన స్వర్గలోక జీవితం వస్తుంది. కనుక మనం మరణాన్ని తలంచుకొని భయపడకూడదు, సంతోషించాలి.

తిరుసభ విశ్వాసులు మరణానికి జాగ్రత్తగా సిద్ధంకావాలని కోరుతుంది, మనం “ఆయత్తంలేని ఆకస్మిక మరణంనుండి మమ్మ కాపాడు" అని దేవుణ్ణి వేడుకొంటాం. మా