పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభువనే నేను వెదికేది. మనకొరకు ఉత్ధితుడైన ఆ ప్రభువనే నేను వాంఛించేది.నేను నూత్నంగా పట్టబోతున్నాను. స్వచ్ఛమైన వెలుగును పొందబోతున్నాను. ఆ ప్రభువుని చేరుకొన్నపుడు నేను పూర్ణమానవజ్ఞవుతాను" అని వ్రాసారు.

మరణంతో మన జీవితం చివరి మెట్టను చేరుకొని పరిపూర్ణమౌతుంది. కనుకనే చాలమంది భక్తులు త్వరగా చనిపోవాలని కోరుకొన్నారు. పౌలు భక్తుడు "ఈ జీవితాన్ని త్యజించి క్రీస్తుని చేరాలని నేను గాఢంగా వాంఛిస్తున్నాను" అన్నాడు ఫిలి 1, 23. క్రీస్తు తన మరణంలో తండ్రిపట్ల విధేయతా, ప్రేమా, కోరికా చూపాడు. ఈలాగే మనంకూడ మన మరణంలో తండ్రిపట్ల విధేయతా, ప్రేమా కోరికా చూపాలి. అప్పడేగాని మన మరణం మనలను పవిత్రపరచదు. ఈ సందర్భంలో అంటియోకయా ఇగ్నేష్యయసుగారు “నా లౌకికవాంఛ సిలువ వేయబడింది. నాలోని జీవజలం నీవు తండ్రి వద్దకురా అని పదేపదే పిలుస్తుంది" అని వ్రాసారు. భక్తులకు భగవంతుణ్ణి త్వరగా చేరుకోవాలనే కోరిక గాఢంగా వుంటుంది. అవిలా తెరేసమ్మగారు "నేను దేవుణ్ణి చూడాలని కోరుకొంటున్నాను. కాని అతన్ని చూడాలంటే నేను చనిపోవాలి" అని వ్రాసారు. చిన్న తెరేజమ్మగారు చనిపోయేటపుడు నేను నిజంగా చనిపోను. జీవంలోకి ప్రవేసిస్తాను" అని వ్రాసారు. భగవంతుణ్ణి గాఢంగా ప్రేమించేవాళ్ళ అభిలాషలు ఈలా వుంటాయి. ఈ భక్తులను చూచి మనం లోక వ్యామోహాలను అణచుకోవాలి. దేవునిమీదికి మనసు త్రిప్పకోవాలి. అతనితో ఐక్యంకావాలని కోరుకోవాలి.

3. మరణానికి సిద్ధం కావడం

1. చాలమంది చావుకి ముందుగా తయారుకారు. ఇప్పడేం తొందర, ఆ విషయం చివరన చూడవచ్చులే అనుకొంటారు. కాని ఇది పెద్ద పొరపాటు. మన జీవితకాలమంతా మరణానికి తయారౌతూనే వుండాలి. వ్యాపారులు డబ్బవిషయం జీవితంలో చివరిదాకా వాయిదా వేస్తారా? రోగి మందు తీసికోవడాన్ని చివరిదాకా వాయిదా వేస్తాడా? వ్యాజ్యెంలో చిక్కుకొన్నవాళ్ళ తమ కేసుని చివరిదాకా పట్టించుకోకుండా వుండిపోతారా? మనకు చావు తధ్యమనీ అది మన జీవితంలో ఎప్పుడైనా రావచ్చుననీ మనకు రూఢిగా తెలుసుగదా! మరి దాన్ని చివరిదాకా వాయిదా వేయడం అవివేకం కదా!

మన మరణ సమయంలో మనం పాపాన్ని పూర్తిగా ద్వేషించాలి. దేవుణ్ణి అన్ని వస్తువుల కంటే అధికంగా ప్రేమించాలి. అప్పడే మనకు రక్షణం కలిగేది. కాని జీవితకాలమంతా పాపాన్ని ప్రేమించే మనం మరణకాలంలో దాన్ని దిడీలున ద్వేషించగలమా? జీవితకాలమంతా సృష్టివస్తువుల్లో తగుల్కొని వుండే మనం మరణ సమయంలో దిడీలున వాటిని వదలి దేవుళ్లీ ప్రేమించగలమా? కనుక మన చావునిగూర్చి