పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. తప్పలను సరిదిద్దారు

దావీదు రాజు ఊరియా అనే సైనికుని భార్య బత్తేబాను మోహించాడు. ఉరియాను యుద్ధంలో మొదటి వరుసలో పోరాడ నియమించి మోసంతో చంపించాడు. అప్పుడు ప్రభువు ఉగ్రుడై ఆ రాజును చీవాట్ల పెట్టించడానికి నాతాను ప్రవక్తను పంపాడు. ప్రవక్త రాజుకు ఓ కథ చెప్పాడు. ఓ నగరంలో ఓ పేదవానికి చాల మందలున్నాయి, ఓదినం ఆ ధనవంతుని యింటికి చుట్టం వచ్చాడు. ధనవంతుడు తనకు అన్ని గొర్రెలున్నా బలత్కారంగా పేదవాడి గొర్రెపిల్లను తీసికొని చుట్టానికి విందు చేయించాడు - అన్నాడు. ఆ మాటలకు దావీదు మండిపడి అలాంటి అన్యాయానికి పాల్పడినవాడు నాల్గంతలు నష్ట పరిహారం చెల్లించాలి అన్నాడు, అప్పడు ప్రవక్త ఈ దుష్కార్యం చేసింది నీవే. నీకు ఇందరు భార్యలుండగా ఊరియా భార్యను అపహరించావు. ఆ పాపం చాలదో అన్నట్లు ఆమె భర్తను కూడ వంచనతో యుద్ధంలో చంపించావు అన్నాడు. దావీదుకు కనువిపు కలిగింది. అతడు పశ్చాత్తాపపడ్డాడు, ప్రభు క్షమాపణం పొందాడు - 2సమూ 12. ఈ విధంగా ప్రవక్తలు తమ ప్రవచనంతో దుష్కార్యాలు చేసినవాళ్ళను మందలించారు. వాళ్ళ తప్పలను సరిదిద్దారు.

ఆమోసు తన నాటి న్యాయమూర్తులు లంచాలు తీసికొంటూండగా వాళ్ళను ఖండించాడు. నాటి ధనవంతులు పేదలను పీడించే తీరును నిశితంగా విమర్శించాడు :

"అన్యాయపు న్యాయమూర్తులు లంచాలు తీసికొని
మంచివాళ్ళను అమ్మివేస్తున్నారు
ఒక జోడు చెప్పలు లంచంగా పుచ్చుకొని
పేదవాడ్డి అమ్మివేస్తున్నారు
ధనవంతులు దరిద్రులను క్రింద పడవేసి
కాలితో క్రొక్కుతున్నారు
వాళ్ళను త్రోవనుండి ప్రక్కకు నెడుతూన్నారు
తండ్రీ కొడుకూ ఒకే స్త్రీని కూడి
ప్రభువు నామం అపవిత్ర పరుస్తూన్నారు" -2.6-7

కాని ప్రవక్తలు చీవాట్ల పెట్టినవాళ్ళంతా తమ తప్పలను సవరించుకోలేదు. అహాబురాజు. కాలంలో నాబోతు అనే రైతు వుండేవాడు. అతని పొలం రాజు మేడకు ఆనుకొనివుంది. రాజు నేను కూరగాయలు పండించుకొంటాను ఆ పొలం నా కమ్మమని అడిగాడు. కాని నాబోతు అది పిత్రార్జితమైన భూమి కనుక నేను అమ్మను అన్నాడు. అహాబు భార్య యెసెబులు కుట్ర పన్నింది. ఇద్దరు దుర్మార్థుల చేత నాబోతు దేవదూషణం