పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అతడు సభనుండి లేచి బయటికి వెళ్ళిపోయాడు. మళ్లాసభలోనికి వచ్చాడు. ఈమారు అతని భుజంపై రెండు ఇసుక సంచులు వ్రేలాడుతున్నాయి. అతని రొమ్ము విూద్ది చిన్న సంచి, వీప విూద్ది పెద్దసంచి. మునులు ఈ సంచుల భావమేమిటని అడగ్గా ఆ మఠశ్రేష్ణుడు ఈలా చెప్పాడు. "ఎక్కున ఇసుకతో గూడిన వెనుకటి సంచి నా తప్పలు. నేను నా తప్పలను గమనించకుండటానికి గానూ, వాటికి పశ్చాత్తాప పడకుండటానికి గానూ, వాటిని నా వెనుక పెట్టుకొన్నాను. ఈ ముందటి చిన్న సంచి నా పొరుగువాని తప్పలు. నేను నిత్యం వీటిని గమనిస్తూ నా పొరుగువానికి తీర్పు విధిస్తూంటాను. కాని యిది పద్ధతికాదు. నేను నా పాపాల సంచి నా ముందుంచికొని నిత్యం నా తప్పలను గమనిస్తూండాలి, వాటిని మన్నించమని దేవునికి మనవి చేసుకొంటూండాలి". ఆ మాటలు విని మునులంతా లేచి నిల్చుండి రక్షణమార్గమంటే యిదే అని పల్మారు.

56 రోమానస్ అనే ముని చనిపోతూండగా శిష్యులంతా అతని చుటూ గుమిగూడిఅయ్యా! నీవు కాలం చేసాక మేమేలా ప్రవర్తించాలో తెలియజేయమని అడిగారు, అతడు ఈలా అన్నాడు. "నేను విరాకేదైనా ఆజ్ఞ యిచ్చినపుడల్లా మిూరా యాజ్ఞను పాటించకపోతే నేను కోపపడగూడదని నిర్ణయం చేసికొనే ఆ యాజ్ఞ నిస్తూవచ్చాను. కనుకనే మనం ఇంతకాలం శాంతితో జీవించగలిగొం."

57. ఓ సన్యాసి సీసోమెస్ మునిని అయ్యా! కామ క్రోధాదులు నన్ను వదలడం లేదేమిటి అని ప్రశ్నించాడు. ముని "బాబూ! వాటి వ్రేళ్లు నీ హృదయంలోనికి లోతుగా చొచ్చుకొని పోయాయి. వాటిని పెతికివేయి, అప్పడు నీకు శాంతి కలుగుతుంది" అని చెప్పాడు.

58. సీమోను అనే మునిని గూర్చి ఈ వదంతం ప్రచారంలో వుంది. ఓసారి పట్టణాధికారి ఆ ముని పుణ్యాన్ని గూర్చి విని అతన్ని సందర్శించడానికి రాదల్చుకొన్నాడు, తోడి సన్యాసులు అయ్యా పట్టణాధికారి నిన్ను సందర్శించి నీ యాశీర్వాదాన్ని పొందడానికి వస్తున్నాడు. జాగ్రత్తగా సిద్ధంకా అని చెప్పారు. వెంటనే అతడు ఓ ముతక బట్టను ధరించాడు. కొంచెం రొట్టా వెన్నా తీసికొని వాకిటిలో కూర్చుండి పరమానందంగా వాటిని తినడం మొదలెట్టాడు, పట్టణాధికారి తన పరివారంతో వచ్చి అలా తింటూన్న మునిని చూచి ఏ మాత్రం మెచ్చుకోలేదు. నేను మహాభక్తుడని విన్నమని యితడేనా అనుకొంటూ చిరాకుగా వెళ్ళిపోయాడు. తన పన్నాగం ఫలించనందులకు సీమోను ముని సంతోషించాడు.

59. సింక్లేటికా అనే సన్యాసిని యిలా చెప్పింది. “లోకంలో మనం పొరపాటున తప్పుచేసినా మనలను జెయిల్లో పెడతారు. కనుక మన పాపాల కొరకు మనలను మనమే చెరలో బంధించి వుంచుకొందాం. ఈలా మనం బుద్ధిపూర్వకంగా తెచ్చుకొన్న శిక్ష రానున్న పరలోక శిక్షను తప్పిస్తుంది",