పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇక్కడ తండ్రి తనప్రేమను "కుమ్మరించాడు" అంటే దాన్ని సమృద్ధిగా దయచేసాడు అని భావం, జలధార చెలమను నీటితో నింపుతుంది. అలాగే తండ్రికూడ మన హృదయాన్ని తన ప్రేమతో నింపుతాడు. ఈ ప్రేమవల్లనే మనం దేవుణ్ణిగాని తోడి జనాన్ని గాని ప్రేమించగల్లుతూన్నాం.

ఇక యీ ప్రేమ ఆత్మద్వారా మనకు లభిస్తుందని చెప్పాం. కనుక సోదరప్రేమకు అంత సులభంగా అలవాటు పడనివాళ్ళ ఆయాత్మనే అడుగుకోవాలి. తమకు ఆ వరాన్ని దయచేయమని ప్రార్ధించాలి.

27. అన్నిటినీ ఐక్యపరచే సాధనం - కొలో 8,14

వారుతో నడికట్టు కట్టుకొంటాం. అది మన వంటివిూది బట్టలన్నిటినీ ఏకంజేసి బిగుతుగా వుంచుతుంది. ఈలాగే సోదరప్రేమ కూడ ఓ నడికట్టలాంటిది. అది న్యాయం, సేవ, కరుణ మొదలైన పుణ్యాలన్నిటినీ ఐక్యపరుస్తుంది. వాటినన్నిటినీ ఒక్కటిగా బంధిస్తుంది. జ్ఞానస్నానం పొందిన నూత్నమానవుడు ఈ సోదరప్రేమ అనే నడికట్ట తాల్చాలి.

28. క్రీస్తు తన్ను తాను సంతోషపెట్టుకోలేదు - రొమా 15,1-3

ఇది యెంత చిన్నవాక్యమో అంత అర్థవంతమైనది. క్రీస్తు తన లాభం తాను చూచుకోలేదు. అలా చూచుకొంటే అతడు మనకొరకు చనిపోయి వుండేవాడు కాదు. మనంకూడ ఆ ప్రభువులాగే మెలగాలి. మన లాభం మాత్రమే మనం చూచుకోకుండ తోడినరుల మేలు కొరకు కూడ కృషిచేయాలి. వాళ్ళ అభివృద్ధికొరకు పాటుపడాలి. సోదరప్రేమంటే ఇదే.మానవుడు మాత్రమే దీనిని సాధిస్తాడు.

29. ప్రేమ చేసే పనులు

పౌలు దృష్టిలో ప్రేమ రెండు ప్రధానకార్యాలు చేస్తుంది. మొదటిది, అది తోడి నరుడ్డి ఓ భవనం లాగ నిర్మించుకొంటూ పోతుంది. అనగా తోడినరుని అభివృద్ధికి కృషిచేస్తుంది - 1కొ 8,1. రెండవది, అది తోడినరులకు సేవలు చేస్తుంది - గల 5,13. ఈ రెండు లక్షణాలు మనలో వుంటే మనకు సోదరప్రేమ అబ్బినట్లే.

విన్సెంట్ ఫెర్రర్ అనే భక్తుడు మనం తోడివారికి చేసే సేవలు ఏడురకాలుగా వుంటాయని చెప్పాడు.