పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



9. ఈ పేద నరుడు మొరపెట్టగా యావే ఆలకించాడు, సకల శ్రమల

నుండి నన్ను రక్షించాడు = కీర్త 34, 5.
ఇది చాల వినయంతో గూడిన వాక్యం. సామాన్యంగా నరులు తమ్ముగూర్చి తాము గొప్పగా ఎంచుకొంటూంటారు. కాని భక్తులూ మహనుభావులూ తమ్ము గూర్చి తాము స్వల్పంగా ఎంచుకొన్నారు. ఈ కీర్తనకారుడు కూడ తనబోటి దీనుడు మొరపెట్టగా ప్రభువంతటివాడు ఆలకించాడుగదా అని ఆశ్చర్యపోయాడు. ఈలాంటి వినయం చాలమంచిది. అబ్రాహాము యావేతో మాటలాడుతూ "బూడిద ప్రోవనైన నేను ప్రభువుతో మాటలాడుతూన్నాను గదా?" అని వినయాన్ని ప్రదర్శిస్తాడు. ఆది 18,27. మనంకూడ "ప్రభో! ఈ దీనుడ్డి రక్షించు" అని సవినయంగా ప్రార్థించుకొంటూండాలి.

10. ఆయన నన్ను తగినవానినిగా తలంచి తన సేవకు నియమించుకొన్నాడు- 1 తిమొు 1, 12.


 పౌలు మొదట క్రీస్తు సమాజాన్ని హింసించాడు. క్రీస్తుకు ప్రత్యర్థిగా నిలిచాడు. క్రైస్తవులను హింసించడానికై డమస్కు వెళూండగా ప్రభువు అతని హృదయం మార్చాడు. ఈలా ఒకవైపున తాను క్రీపునకు వ్యతిరేకంగా పనిచేస్తుంటే, మరోవైపున క్రీస్తు తన్ను శిష్యునిగా ఎన్నుకొంటూన్నాడు. ఈ సత్యం పౌలు మనసును కరిగించింది. నేను తనకు అపరాధం చేస్తున్నాగూడ ఆ ప్రభువు నన్నుయోగ్యునిగా భావించాడే అని పౌలు ఎంతో ఆశ్చర్యపోయాడు. మనం కూడ ఈలాగే భావించాలి. మనమంతా అయోగ్యులం. కపటవర్తనులం, పాపులం. ఐనా ప్రభువుకి మనమీద సదభిప్రాయం వుంది. కావుననే మనలను తన శిష్యవర్గంలో చేర్చుకొన్నాడు. మనలను మెచ్చుకొనే ఆ ప్రభువుపట్ల మనం
కృతజ్ఞత చూపవద్దా?

11. నీకు ప్రభువు మీద నమ్మిక లేకపోతే నీ వసలు నిలువనే నిలువవు
- యెష 7,9.
 యొషయా ప్రవక్త కాలంలో సిరియా రాజులు యెరూషలేము రాజగు ఆహాసు మీదికి దండెత్తి వచ్చారు. ఆ సంగతి వినగానే యెరూషలేము పౌరుల గుండెలు గాలివానకు కొట్టుకొనే చెట్టు కొమ్మల్లాగ దడదడ కొట్టుకొన్నాయి. ఆ యాపదనుండి వాళ్ళను రక్షింపగలవాడు ప్రభువొక్కడే ఐనా ఆహాసురాజుకి ప్రభువమీద నమ్మకం ජීක. ෂටකඨිජ అతడు రక్షణార్థం బాబిలోనుకు రాయబారులను పంపుతున్నాడు. ఆ సందర్భంలో రాజును మందలిస్తూ ప్రవక్త పల్కిన పల్మిది. ఆ యాహసు రాజులాగే మనమూ కష్టాలువచ్చినపుడు