పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26. నీవు నన్ను చెరిచావు 259 27. హృదయంలోని అగ్ని 261 28. సమరయ స్త్రీ 262 29. రెండు మార్గాలు 267

1. దైవ ప్రేమ

1. పెకెము నిబంధనం - యెహోషువ 24, 14-28.

1. యిప్రాయేలీయులు ఎడారిలో చాల యేండ్లు గడిపి వాగ్రత్త భూమిని చేరుకొన్నారు. అక్కడ యెహోషువ 11 తెగలవాళ్ళకు నేలను పంచియిచ్చాడు. కనుక పూర్వం దేవుడు ప్రమాణం చేసిన వాగ్లాత్తభూమి వారికి సంక్రమించి. వారి చిరకాల వాంఛ తీరింది. కాని నాయకుడైన యెహోషువ త్వరలో కన్నుమూయనున్నాడు. కాని అతడు తాను చనిపోకముందు యిస్రాయేలీయులచే మేము యావేను మాత్రమే కొలుస్తామని ప్రమాణం చేయించాలనుకొన్నాడు. ప్రభువుపట్ల అతనికి గాఢమైన భక్తి ప్రేమా వున్నాయి. తన అనుయాయులైన యిస్రాయేలీయులు మరో దేవుణ్ణి కొలవడం అతడు సహించలేడు. కనుక వాళ్ళచే ఈ ప్రమాణం చేయించాడు.

2. యెహోషువ ప్రజలందరిని షెకెము పుణ్యక్షేత్రంలోని దేవళంలో ప్రోగుజేసాడు. తాను మధ్యవర్తిగా నిల్చి ప్రజలకూ దేవునికీ మధ్య నిబంధనం చేయించాడు - 24, 25-27.


పితరులైన అబ్రాహాము, యాకోబు, ఈసాకుల కాలం నుండి యిస్రాయేలీయులను నడిపించుకొని వచ్చింది యావే. వారి శత్రువులందరినీ ఓడించి, కష్టాలనుండి వారిని గట్టెక్కించి కట్టకడన వాగ్లత్త భూమిలో చేర్చింది యూవే. అలాంటి ప్రభువుని యిప్రాయేలీయులు తప్పక పూజించాలి. ఒకవేళ ప్రజలు ఆ ప్రభువుని విడనాడినా తనూ తన కుటుంబం మాత్రం యావేను కొలుస్తామని శపథం చేసాడు — యొహోషువా - 24, 15. అతని భక్తి అంత గొప్పది.

ప్రజలు, మేము నిస్సందేహంగా ప్రభువుని పూజిస్తాం. మరో దేవుణ్ణి కొలవం. మా మాటలకు మేమే సాక్షులం అని ప్రమాణం చేసారు. ఆ కాలంలో యెహోషువాకులాగే వాళ్ళకు కూడ ప్రభువమీద చెదరని భక్తి వుంది.

ఆ సందర్భంలో యెహోషువా షెకెము దేవళంలో దేవునికీ ప్రభువుకీ మధ్య నిబంధనం చేసాడు. ప్రజలు అన్యదైవాలను కొలవగూడదనీ, యావేను మాత్రమే పూజించాలని శాసనం చేసాడు. ఈ వొప్పందానికి సాక్ష్యంగా అక్కడ ఒక పెద్ద రాతిని గూడ పాతించాడు.

3. ఈ ఘట్టంలో ప్రధానంగా కన్పించేది దైవభక్తి, తమ జీవితంలో ఎన్నో వుపకారాలు చేసిన దేవుణ్ణి మర్చిపోమని ప్రజలు బాసచేసారు. అతన్నిదప్ప అన్యదైవాలను సేవించమని వాగ్హానం చేసారు. ఈ ప్రజల ప్రవర్తనం నేడు మనకుకూడ ప్రేరణం పుట్టించాలి. మన జీవితమంతా దేవునితో ముడివడి వుంటుంది. అతని కరుణవల్ల మనం 235