పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

    1. వష్టి రాణి 158
    2. మొర్టెకయి - ఎస్తేరు 158
    3. యూదులకు అపాయం 159
    4. యూదులు పగ తీర్చుకోవడం 160
    5. పూరీము ఉత్సవం 161
  4. పుస్తకం సందేశం 161

4. రూతు గ్రంథం 162


  1. గ్రంథ స్వభావం 162
  2. కథా సంగ్రహం 163
  3. వివరణం 163
     1. మోవాబులో నవోమి 163
     2. రూతు బోవసును కలిసికోవడం 164
     3. వివాహ సూత్రధారిణి నవోమి 164
     4. రూతు బోవసుల పెండ్లి 165
     5. దావీదు వంశవృక్షం 165
  4. పుస్తకం సందేశం 166
  - అనుబంధం - సూసన్నకథ 167

మిడ్రాష్ కథలు

పూర్వవేదంలో మిడ్రాష్ అనే సాహితీ ప్రక్రియకు చెందిన కథలు వున్నాయి. ఈ రకం కథల్లో మూడు ప్రధాన లక్షణాలు కన్పిస్తాయి. 1. రచయిత బైబుల్లోని కొన్ని భాగాలను ఎన్నుకొని వాటిమీద వివరణం చెప్మంటాడు. బైబులు వాక్కు తన కాలపు ప్రజలకు ఎలా అన్వయిస్తుందో వివరించి చెప్తాడు. 2. చారిత్రక సంఘటనలను కొన్నిటిని ఆధారంగా తీసికొని వాటితో ఓ కథ అల్లుతాడు. ఈ కథలో చారిత్రకాంశాలు కొన్ని వున్నా కథ మాత్రం కేవలం కల్పితమైంది. 3. ఈ కథ ద్వారా ప్రజలకు దైవభక్తినీ, నీతినీ, ధర్మాచరణను బోధించడం రచయిత ఉద్దేశం. ఈ కథలో ముఖ్యాంశం ఉపదేశమే కాని చరిత్ర కాదు. బైబుల్లో తోబీతు, యూదితు, ఎస్తేరు, రూతు, యోనా గ్రంథాలు ఈలాంటి మిద్రాష్ కథలు. “మిడ్రాష్" అనే హీబ్రూ మాటకు వివరణం, వ్యాఖ్యానం, ఉపదేశం అని అర్థం. రూతు గ్రంథం మిడ్రాష్ కథకాదు. చారిత్రక గ్రంథమే. అయినా దైవభక్తిని బోధించే చిన్న