పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. రూబు దృష్టాంతం యోబు ఊజు దేశీయుడు. అతడు సంపన్నుడు. పొలాలతో పసుల మందలతో, సిరిసంపదలతో హాయిగా కాలం గడుపుతున్నాడు. పూర్వవేద ప్రజలు సంతానాన్నిదేవుని

దీవెనగా భావించేవాళ్ళు యోబుకి ఏడురు కొడుకులూ ముగ్గురు కూతుళ్ళూ వున్నారు. 

అనగా దేవుడు అతన్ని సమృద్ధిగా దీవించాడని భావం. అతడు దోషరహితుడు, ధర్మాత్ముడు, పాపానికి దూరంగా వుండేవాడు. కనుక అతడంటే దేవుడికి యిష్టం.

ఓ దినం దేవదూతలూ సాతానూకూడ దేవుణ్ణి దర్శించడానికి వచ్చారు. దేవుడే సంభాషణం ప్రారంభించి "నీవు నా సేవకుడైన యోబుని చూచావా?" అని సాతానుని అడిగాడు - 1,8.పిశాచానికి యోబు భక్తిమీద నమ్మకం అట్టే లేదు. అతడు స్వార్థపరుడన

దాని భావం. కనుక అది దేవునితో “యోబు తమరిపట్ల వట్టినే భయభక్తులు చూపడం 

లేదు" అంది-1,9. అనగా యోబు దేవుడు తనకు దయచేసిన భోగభాగ్యాలకోసం అతన్ని సేవిస్తున్నాడని పిశాచం భావం, అది “మీరు యోబు ఆస్తిపాస్తులన్నీ తీసికోండి; అతడు మీ మొగం ముందటనే మిమ్మ శపించి తీరుతాడు” అని సవాలు చేసింది. దేవుడు పిశాచం సవాలుని అంగీకరించాడు. “యోబు భక్తుడో కాదో నీకే తెలుస్తుంది. అతని యాస్తిపాస్తులన్నీ నీ యధీనంలో వుంచుతూన్నాను. నీవు అతని వంటిమీద మాత్రం చేయి పెట్టవద్దు" అన్నాడు దేవుడు. దీనితో యోబుకి తిప్పలు ప్రారంభమయ్యాయి - 1, 12.

పిశాచం యోబుని రెండుసార్లు పరీక్షించింది. మొదటి పరీక్షలో శత్రువులు వచ్చియోబు పనుల మందలన్నీ తోలుకొనిపొయ్యేలా చేసింది. అతని కొడుకులూ కూతుళ్ళూ విందారగిస్తూండగా గాలివాన వీచి యిల్ల కూలిపడి వాళ్ళంతా చనిపోయేలా చేసింది. ఈలా సాతాను యోబుని ఒక్కరోజులో బికారిని చేసింది.

ఈ విధంగా తన ఆస్తిపాస్తులూ సంతానమూ నాశమై పోగా యోబుకి దుఃఖం కలిగింది. అతడు సంతాప సూచకంగా వంటిమీది బట్టలు చించుకొన్నాడు. తల గొరిగించుకొన్నాడు. తాను దైవచిత్తానికి లొంగానని తెలియజేసూ నేలమీద బోరగిలబడి దేవుడికి దండం పెట్టి

"

నేను దిగంబరుడనుగానే తల్లి కడుపునుండి వెలువడ్డాను
 మళ్ళా దిగంబరుడనుగానే యిక్కడినుండ వెళ్ళిపోతాను
 ప్రభువు దయచేసిన వాటినన్నిటినీ మళ్ళా తానే తీసికొన్నాడు
 అతని నామానికి సుతి కలుగు

నుగాక”

అన్నాడు – 1,21. ఇవి ఆ మహాభక్తుని నోటినుండి వెలువడిన ముత్యాల్లాంటి వాక్యాలు. ఇన్ని దురదృష్టాలు వాటిల్లినా యోబు దేవుణ్ణి దూషించి పాపం కట్టుకోలేదు. 119