పుట:Bhoojaraajiiyamu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదనరేఖ కథ

89


వ.

అయ్యితిహాసం బెట్టి దనిన మగధదేశంబునందు [1]నంభీరుం డనునొక్క
మహీపాలుండు పెద్దకాలంబు తనకు సంతానంబు లేక భూదేవతల రప్పించి
పుత్రకామేష్టి సేయింప నయ్యగ్నికుండంబువలన నొక్కతేజోమూర్తి యగు
కొడుకును, నొక్క యధికస్వరూపిణి యగు కూఁతురుం బుట్టిన నయ్యిద్దఱకుం
గ్రమంబునఁ బావకలోముండును మదనరేఖయు నను నభిధానంబు లొనరించి
పెనుపుచుండునంత నయ్యిరువురు తండ్రినియోగంబున విద్యాభ్యాసంబు
సేయుచు.

72


చ.

సదమలయుక్తిఁ జేసి గురుసన్నిధిఁ బావకలోముఁ డోలిఁ బ్రాఁ
జదువులు ధర్మసంహితయు సామజశిక్షయు నశ్వశాస్త్రముం
బొదలెదు నస్త్రసాధనయు భూపతినీతియు గానవిద్యయున్
మొదలగు విద్య లెల్లఁ దుదిముట్ట నెఱింగెఁ బరిస్ఫుటంబుగన్.

73


క.

అతని సహోదరి యగు న
య్యతివయుఁ దగఁ గావ్యనాటకాలంకార
ప్రతతు లొగి నభ్యసించుచుఁ
జతురత మై నుండె నొక్కసమయమునందున్.

74


సీ.

నూఁగారుఁదీఁగెకు నూతనావాలమై
       తనరారు నాభిరంధ్రంబుఁ జూచి
సుభగత్వలక్ష్మికి సోపానమార్గమై
       రమణీయమగు వళిత్రయముఁ జూచి
యౌవనశబరు చే నమరుమారెడుపండ్ల
       క్రియ నందమగు కుచద్వయముఁ జూచి
ముఖచంద్రమండలంబునఁ దోఁచునమృతపూ
       రము భంగి మధురాధరంబుఁ జూచి


తే.

గురుతనూజుండు మనమునఁ గోర్కి నిగుడఁ
దోడిశిష్యుల నందఱు వీడుకొలిపి

  1. శంబరుండను. ఈ రాజు అంభీరుఁడని తరువాత పేర్కొనఁబడును.