పుట:Bhoojaraajiiyamu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భోజచరిత్ర

47


తొలఁగితి నే; నటు లుండఁగ
వలదే రాజ ననువాఁడు వసుమతిలోనన్.

122


క.

సిద్ధులలోపల నెల్లఁ బ్ర
సిద్ధుఁడు సర్పటి యనంగఁ జేయుదు నను స
ద్బుద్ధి గల దేని, నాకుఁ బ్ర
వృద్ధం బగు శబ్దభేది విద్య యొసఁగుమా!

123


క.

ఏనును నిచ్చెద నీకు న
నూనం బగు ధూమవేధి యొప్పుగ' ననినన్
‘గానిండు మీరు పెద్దలు
గానఁ దొలుత నాకు నొసఁగఁ గావలయుఁ జుడీ!

124


క.

మఱి నా కన్నతెఱంగున
నెఱిఁగించెద నాదువిద్య యేర్పడ' ననినన్
దెఱఁ గేది భోజభూపతి
కఱిముఱిఁ దనవిద్య చెప్పి యతఁ డి ట్లతియెన్.

125


ఉ.

'చెప్పెతి నాదువిద్య [1]యఱ చేయక నీదగువిద్య యేర్పడం
జెప్పుము నాకు' నావుడును జెన్నగుమోమునఁ గొంత వింత న
వ్వొప్పఁగ భోజుఁ డిట్టు లను 'నొచ్చెల నే నొక విద్యవాఁడనే
[2]తప్పుఁగఁ జిత్తగింపకుఁడు, తద్విధ మే నెఱుఁగ న్మునీశ్వరా!"

126


క.

అనిన విని 'యేటిమాటలు
ఘనతర మగు శబ్దభేది గలుగుట లేదే
జననాథ! మున్ను నీచే'
ననవుడు విని భోజుఁ డిట్టు లను నాతనితోన్.

127


ఉ.

మించగువిద్య భోజునకు మేదినిపైఁ గల దన్నశబ్ద మొ
క్కించుక నీదు వీనుల వహించినమాత్రన [3]నీ మనంబు వే
ధించుటఁ జేసి యిందుఁ జన దెంచితి గావున శబ్దభేదినా
నంచిత మైనవార్త గల దంతియ కాని యెఱుంగ నెద్దియున్.

128
  1. యర
  2. తప్పఁగ
  3. నా