Jump to content

పుట:Bhasuni bharata natakamulu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

VII

మూలకవిహృదయములో లేని నూతనభావము వచ్చుటకు వీలులేదు. నాయొనర్చినపని మిక్కిలి క్రొత్తమార్పుగాడు. నేను లక్షణ మతిక్రమింప లేదు. వ్యాకరణమును మీఱలేదు, సీసము క్రిందఁ జేర్పవలసినదని చెప్పిన పద్యమును జేర్చ లేదు. ఇది యే నాయపరాధము. ఇందుకుఁ బండితాభిప్రాయమే ప్రమాణము. ఇది త ప్పన్నపక్షమున వారి యభిప్రాయము శిరసావహించి దిద్దుకొందును. సంస్కృతమున మధ్యమవ్యాయోగము కవిత్వము నందు భావమునందు మిక్కిలి రసవంతమై యున్నది. నాయొసర్చీన యాంధ్రమధ్యమ వ్యాయోగమునం దిట్టిరసము కనఁబడక పోవునేని సయ్యది నాలోపముగాని భాసమహాకవిలోపము గాదు. అన్ని వ్యాయోగములలో నుండునట్లే దీనియందుఁగూడ నొక్కటే యంకము కలదు. అందుచేత దీనిం బ్రయోగించుటకు రమారమి యొకగంట కాలము పట్టును. కథాచమత్కృతి ప్రేక్షకులకుఁ జదుపరులకు నాహ్లాదముఁ గలిగించు నని నిస్సంశయముగాఁ జెప్పవచ్చును.

ఇట్లు,
చిలకమర్తి లక్ష్మీనృ సింహం.