Jump to content

పుట:Bhasuni bharata natakamulu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2 భాసుని భారత నాటకములు


చ. అలసిన చిన్నబిడ్డలు కులాంగనయుం దను వెంబడింప, మొ క్కలమున రక్కసుండు వెనుకం దఱుమంగను, బెద్ద బ్రాహ్మణుం డల పులిబారి కగ్గమయి యావును జంకిన లేఁగదూడలుం గలవృషభంబువోలె నధికప్యథఁ జెందుచున్నున్న వాఁడిటన్.

(నిష్క్రమించుచున్నాఁడు.)

ఇది స్థాపన