పుట:Bharatiyanagarik018597mbp.pdf/49

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


క్రీ. శ. 758 వరకును చంపారాజ్యము నేలెను. వీరిలో ప్రకాశధర్ముడను నతడు ముఖ్యుడు. "చంపాపుర పరమేశ్వర మహారాజశ్రీ ప్రకాశ ధర్మ"యనున దీతనిపేరు. ఇశానేశ్వర, ప్రభవేశ్వరాది దేవాలయము లెన్నియో యీతనిచె నిర్మింపబడినవి. క్రీ. శ. 758 లో చంపాసామంతులు పాండురంగపురాధీశ్వరుడగు పృథివీంద్ర వర్మను చంపాసింహాసనమున గూర్చుండబెట్టిరి. ఈతని వంశీయులు క్రీ. శ. 9 వ శతాబ్ది మధ్యభాగము వరకును రాజ్యమేలిరి. క్రీ. శ. 774 లో యపద్వీపవాసులు చంపాపైదండెత్తి, కౌధారవిషయమును కొల్లగొని, యచటి శంభుదేవాలయమును పాడుచేసి, లింగమును గొనిపోయిరి. పిమ్మట నప్పటిచంపారాజగు శ్రీపత్యవర్మ శత్రువులతో సముద్రముపై యుద్ధమొనర్చి వారిని దరిమివైచి, కౌథారమున నొక చక్కని యాలయమును గట్టించి తనపేరిట సత్యముఖలింగమును నెలకొల్పెను. రాజధానియగు బాండురంగపురమున నిత డొక గొప్ప సౌధమునునిర్మించెను. ఈవంశములోని ఇంద్రవర్మ క్రీ. శ. 787 లో యవద్వీపవాసుల దండయాత్రను ప్రతిఘటించి, యనేక శివాలయములను స్థాపించెను. ఈతనికాలమున శంకరనారాయణ విగ్రహములును, వాని యారాధనము, వ్యాప్తిలోనికి వచ్చినవి. చంపారాజ్యములోని హిందూమతపరివర్తనమునం దిది యొక ముఖ్యాంశము. ఈరాజు వెనుక చంపారాజ్యము నేలినవాడు నీతని తమ్ముడనగు మొదటి హరివర్మ. చంపారాజులలో నగ్రగణ్యుడు. క్రీ. శ. 803 లో నితడు చైనాలోని గొన్ని భాగములను జయించి రాజాధిరాజ బిరుదమును వహించెను. ఇతని తనయుడును యువరాజునగు విక్రాంతవర్మ కాంభోజదేశముపై దాటివెడలి యచటి రాజునోడించెను. ఈవంశీయుల పాలనము క్రీ. శ. 860 లో నంతమయ్యెను. అటుపై మహారాజాధిరాజ ఇంద్రవర్మయు, నాతని పుత్రుడగు జయసింహవర్మయు క్రీ. శ. 900 వరకును రాజ్యమేలిరి. ఈకాలమున మహాయాన బౌద్దమతము చంపారాజ్యమున వ్యాపించెను. క్రీ. శ. 900-1071 నడుమ మూడువంశములు చంపారాజ్యమును పాలించినవి. ఈకాలమున