పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 3]

83

భారత రమణి

(వినోదిని వచ్చును)

దేవే-- నాకొఱకే కాబోలు- నాకు ప్రాణాంతముగా నున్నది.... ప్రాణ మున్నదా? (పోవును)

వినో--తండ్రిగారి మతి తల్లడిల్లినది. లేకున్న ఇంత కోపము, చిటపటలాడుట పూర్వముండెనా?

                   ------

నాల్గవ రంగము

[దేవేంద్రు నిట్లు-గాలివాన, వడగండ్లు, ఊరుములు కుముదిని మంచముపై పదుక్కొనుచు, ప్రక్కను తల్లి కునుకుచుండును. దేవేంద్రుడు నిలుచును] దేవే--తాత్రి యెంత భయానహమై యున్నది? ముసలధారలు కట్టి వర్షము కురియుచున్నది. వడగండ్లు పడుచుండుటచే తలుపులు చిల్లులుపడుచున్నది, మేఘములు-వలలో బదిన వ్యాఘ్రముల భాతికోపోద్రేకమున గంభీరముగా గర్ఝించుచున్నవి. సృష్టియంతయు లోపించినటుల చిమ్మచీకటి కమ్ముచున్నది. పాడుపడిన యీకొంపయు నేను మాత్రమే నిల్చియున్నాము. దౌర్భాగ్యుడను నాచుట్టు వేరెవ్వౌను లేరు కాబోలు, ఈతుపా నడగి, ఈయంధకార మంతరించినవెన్క సూర్యకిరణప్రసారమున పూవులు పూసి, పక్షులు కలస్వరములతో నాకసమున నెగురుచుండ, వసంత వాయువీచికలు శ్యామలలతలపై మెల్లమెల్లగ వీచుచుండ, కమ్మని తెమ్మె