పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 1]

73

భారత రమణి

నాచరింప గలవు, నాచేత గాదు; నీ కందు విశ్వాసమున్నది. నాకు లేదు. తగవు తీఱినది. ఇక చాలించు...(పోవును)

(మహేంద్రుడు వచ్చును.)

మహే-- ఇదే నోటుల కట్ట ఇప్పుడు నాసముడెవరు? దీనితో కొన్నాళ్లు కాలక్షేపమగును.

వినో--మహేంద్రా! నీ చేతిలోని దేమి?

మహె--ఆ? యేమీ లేదు... కాగితములు

వినో--ఏ కాగితములు?

మహే--కాదు-పత్రములు

వినో--నేను నమ్మను. ఏవీ చూపుము.

మహే--ఇవి నోట్లు

వినో--ఏ కెక్కడివి? నిజము చెప్పు

మహే--ఆటలో గెలుపు

వినో--అయ్యో! తమ్ముడా జూదమాడుటమానవా? నీవు బొత్తిగా పాడయినావు. ఎన్నిసారులు చెప్పినను వినవు. మన దారిద్ర్యము నీ మనసున గలుగుట లేదా? ఇట్టి చెడుదినములయందు తండ్రిగారికి తగినంత సాయము చేయుట మాని, ఉన్నదంతయు నూడ్చి జూదమున పెట్టుచుంటివి! ధనమెచ్చటనుండి తేగల్గుదువు? దొంగిలింతువు కాబోలు! అయ్యో! తమ్ముడా, పండువంటి కులగౌరవమును పల్చన చేయుచుంటివా? తుదకు దొంగతనము కూడ అబ్బెనా?

మహే--లేదు లేదు, నేను దొంగలాడ లేదు.