పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
32

అం 1]

భారత రమణి

మంచిది. పరమసాధువు, సనాతనార్యఋషి సంఘటితము అది పాడుపడునా? అట్లనగూడదు.

(కాగితము కలముతో మహేంద్రుడు వచ్చును)

మహేంద్రా, తెచ్చినావా? ఇటు తెమ్ము... కాదు. నీవే వ్రాయుము.

మహే--ఏమి వ్రాయను?

కేదా--'ఈపెండ్లి కాబోదు ' అని వ్రాయుము. పిమ్మట నందరికిని చూపవలయును... నవ్వెదమేమి? వ్రాయి! (అతడు వ్రాయును) ఏదీ చూపుము. (చదివి) ఏదీ కలము, ఇదిగో నా సంతకము. 'శ్రీ కేదారనాధ భట్టాచర్యులు ' చూడు. దీనిని జాగ్రత్తగా నుంచుము. అందరికీ చూపవలయు. సంతకమయినది. ఇక భయము లేదు. అమ్మా భీతిల్లకు, రమ్ము లోనికి పోవుదము (వెళ్లుదురు).

హే--అసాధ్యుడు లాగున్నాడు.(వెళ్లును)

                 -----

పదవ రంగము

(దేవేంద్రుడు, ఉపేంద్రుడు, యజ్నేశ్వరుడు, సదానందుడు, ఉపేంద్రుని భక్తగణము) ఉపే--దేవేంద్రా, జాగేల? ముహూర్త మాసన్నమైనది. ప్రధానము కానిమ్ము, "శుభస్య శీఘ్రమ్",