పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
34

[అం 1

భారత రమణి

దేవే-- గొప్ప చిక్కులో తగుల్కొన్నాను..... వాడు మూడుకాళ్ళ ముసలి...కాని...ఏమి చేయుదును? ఇంతకన్న వేఱుపాయము తోచదు.. ఆ ! కాదుకాదు... వా ఢధముడు... నీఛుడు.. తెలిసి యుండియు కన్యను గంగలో తోయుదునా?

(ఉపేంద్రుడు వచ్చును)

ఉపే-- దేవేంద్రా ! నీ యోగక్షేమముల నారయ వచ్చితిని. అందరికిం గుశలమా?

దేవే-- శరీరమునకు కుశలమే, కాని మనసునకు మాత్రము అలమట తీరలేదు. సంసారమున అనేకములగు వ్యధలు.

ఉపే--తమ్ముడా! తధ్యము. సంసారము కేవల దు:ఖ మయము, సుఖమున్నది కాగడా న్వెదకినం గానరాదు. కావుననే జ్ఞానులు సంసరము మాయ యని వక్కాణింతురు. ఈ వ్యామోహజాలమున బడిన మానవుడు రాగరజ్జువుల ద్రెంపగల్గుట దుస్సాధ్యము. బుద్దదేవు డందుననె సంసరము నేవగించి సంఫదలను రోసి తురీయాశ్రమమును స్వీకతించెను. ఆ మహాత్ముని మనోబల మపారము. పాపిజీవు లట్లు చేల్యజాలరు. సాధ్యమగునంతవట్టు నిర్లిప్తులమై యుంవలయు, నీవు నాకు తమ్ముడవు గాన నుపదేశించుచుంటిని. చింతను వీడుము.