పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
104

[అం 3

భారత రమణి

దేవే-- నీవిచ్చితివా ఏమి? నా కొరకై నీ వొక కాసైన వ్యయపరిచితివా? యావజ్జీవము నిన్ను శత్రువుని వలె బావింతును. నీవు నన్ను బాగుగ నెరుగుదువు కదా? నా పూర్వు లెవరును దానముల పట్టలేదు, నేను కూడ, ప్రతిగ్రహించు వాడను కాను.

సదా--నీ కీఆందోలన మేల? ఇదే ప్రమాణము చేసి చెపుచున్నాను. ఇందు నాసొమ్ము ఒక గవ్వయైన లేదు.

దేవే--అట్లైన నీ కీసొమ్మెక్కడిది?

సదా--నీ భార్య పంపినది.

దేవే-- నాభార్యయా? ఆమె కైదువేల రూపాయ లెట్లువచ్చెను.?

సదా--నాకు తెలియదు. నాకుమారుడు నాకీ సొమ్మిచ్చను. అత డిట్లు చెప్పెను.

సదా--ఇది ఆమె కెట్లు లభించెనో అదిగితివా?

సదా--ఆవిషయము మెవరికిని చెప్పవలదని ఆమె నిషేధించె నట.

దేవే--సరే, నేనామ నడిగెదను సదానందా, నాపై తీర్పుచెప్పబడిన డిక్రీసొమ్ము జాగ్రత చేసితిని, కొర్టులో దాఖలు చెయుదువా? నీకు వీలున్నదా?

సదా--తెమ్ము, నేడే చెల్లించెదను. తీరుబడి కావసినంత ఉన్నది.