పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
54

అం 1]

భారత రమణి

నవీ-- మీరు కాదు, సదానందా, నీవు చెప్పవలయును.

సదా--నీ కూతురు నీయల్లుడు- నేనేమనగలను?

దేవే--అట్లనకుము, శుభకార్యము చేయుచున్నాను. సంతుష్టమగు మనసు ప్రసన్నమగు ముఖముతో నీవు సమ్మతింపకున నేను దీని నొనరింపను. మనసార నీవు వచింపుము... ప్రారంభింపనా? సదానందా! నీవు నాకు బాల్యమిత్రుడవూ ఇట్టి సమయమున నూరకుండుట నీకు తగదు. నీముఖ,మున మందహాసరేఖలు గాంచకున్న నేనీ కార్య ముపక్రమింపను.ఏమందువు?

సదా--సరే...నా అభిప్రాయ మెరిగింపుమని ఇంతగా అనురోధించు చున్నావు కావున, చెప్పుచున్నాను విను. నీకూతురికి ఈ పెండ్లి చేయుట మాఱుగ కాలుసేతులు కలియగట్టి గంగలో బడద్రోయుట మేలు.

హరి--ఏమి, సదానందా, అట్లనుచున్నావు?

ఉపే-- దేవేంద్రా! నేను చెప్పుచున్నాను,అది చాలదా? నామాటకన్న సదానందునిమాట నీకెక్కుడు శుభదాయకమా? నేను నీకు సోదరుడ, అగ్రజుడ, నామాట నీకు రుచింపదా?

నవీ--గురువుగారి వాక్యము--