పుట:Bhaktirasashatak018555mbp.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు.

సూర్యనారాయణశతకము.


శా. శ్రీమత్సర్వసుపర్వసేవితములై క్షేమాంకలక్ష్యంబులై
ధామధ్వస్తసమస్తలోకనిబిడధ్వాంతంబులై మించు నీ
రామాంఘ్రుల్ గొనియాడి వృత్తశతకగ్రంథంబు నీకింపుగాఁ
బ్రేమన్ గూర్చెదఁ జిత్తగింపు మెలమిన్ శ్రీసూర్యనారాయణా. 1

శా. భారద్వాజపవిత్రగోత్రజుఁడ విప్రశ్రేష్ఠవంశ్యుండ వి
ద్యారక్తుండ వరాహవేంకటనృసింహాఖ్యుండ సద్భక్తి నిం
పారం గొల్చుచు నీకు వృత్తశతకం బర్పింతు వాగ్దోషముల్
చేరం జూచి కృపన్ సహింపు మదిలో శ్రీసూర్యనారాయణా. 2

మ. అరయన్ బావనమైన యీశతకపద్యవ్రాత మాలించినన్
బరమప్రీతిఁ బఠించినన్ బుధులు నీపాదాంబుజధ్యాతలై
దురితధ్వాంతవిముక్తిఁ గాంచి శుభముల్ తోడ్తోఁ బ్రవర్తింప నీ
చిరకారుణ్యమతిన్ సుఖింతు రెపుడున్ శ్రీసూర్యనారాయణా. 3

మ. శ్రితసంపత్సుమవల్లియౌ నరసవెల్లిన్ మల్లికాద్యుల్లస
ల్లతికావేల్లితసాలమూలకుసుమారా