పుట:Bhaktirasashatak018555mbp.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పీ ఠి క

 శివశతకము వ్రాసినకవినామము తెలుపుపద్యములు మేము ప్రత్యంతరము వ్రాసికొన్నమాతృకలో లెవు మాకుజిక్కినప్రతియొక్కటియే యగుటవలనను నూటయెనిమిదిపద్యములకు నందింపక గొన్ని కొఱతపడియుండుటవలనను ప్రత్యంతర సహాయము లేకుండుతవలనను రచయితను నిర్ణయింప వీలులేకపోయినది. శతకకర్త పద్యములలోనివిషయములను బట్టిచూడ వీరశైవుడని తోచుచున్నది. చెన్నబసవడు, బసవేశ్వరుడు, శివనాగుమయ్య, నిమ్మవ్వ, ధూర్జటి, ఉద్భటారాధ్యుండు లోనగువీరశైవుల నీకవిస్తుతించుట యీయూహకు దర్కాణముగానున్నది. కవి వీరశైవుడని నిరూపింప వీలుచిక్కినది. కవికాలమును గుఱించి ప్రయత్నింప నొకస్వల్పావకాశ మీశతకమున గలదు.
     ఈశతకమున రచయిత వీరశైవులగు శివభక్తుల ప్రభావముల నెన్నుచు ఆంధ్రకవులలో నగ్రేసదుడఘు ధూర్జటికవి నిటుల బ్రశంసించినాడు.