పుట:Bhagira Loya.djvu/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బొమ్మలరాణి

కబుర్లు పంపించారు. వీరయ్య మండిపోయాడు. లోలోన క్రుంగిపోయాడు. ఈ సంగతి కామేశ్వర్రావుకు తెలియదు.

వీరయ్య సీతారామయ్యగారితో ఆ విషయం మనవి చేసుకున్నాడు. ఆయన తెల్లపోయినాడు.

సీతా -- ఈ ప్రపంచకములో యిదో పెద్ద దురన్యాయ మోయి! ఏ ఉత్కృష్టవిద్య నేర్చుకున్నా దెయ్యం నీడలా వెంటపడుతూ వుంటుంది ఈ దురదృష్టము. నాటకాల్లో వేషాలు వేసేవాళ్ళు, సంగీత పాటకులు గొప్పవాళ్ల యిళ్ళల్లో వున్న స్త్రీల మోహభాణాలకు గురా? ఆడవాళ్లు వస్తే మగవాళ్లు శుంఠలైపోవడమా? ఛీ! ఛీ!!

వీర -- ఏమిటండి, ఇప్పు డుపాయం? నాకు మతిపోతోంది.

సీతా -- నావల్లే యీ చిక్కు వచ్చిందని అనుకుంటా నోయ్!

వీర -- మాకులంలో వాణ్ణి యిట్టాంటప్పుడు మా అమ్మిణి పెళ్లిచేసుకుంటందా సామీ !

సీతా -- అదీ నిజమేనోయ్!

విఠలుడు -- మీరు మా అమ్మణితో కదిలేస్తురూ సామీ. మాకు దాని దగ్గిరికి వెళ్లడమే భయంగా వుండది.

87