Jump to content

పుట:Bhagira Loya.djvu/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భోగీరలోయ

యాన్ని నింపి వేస్తుండగా, ఒకసారి భావాలు లేని చైతన్య రహిత హృదయం కలదాన్ని అవుతూ ఆగిపోతిని. పై నుండి విద్యార్థులు, భిక్షకులు, నా కేసి తేరిపార చూస్తున్నది నేను గమనించనే లేదు. ఆ ప్రధమదర్శన ముహూర్తము పరమ పూజ్యమైంది.

ఆ పవిత్రప్రదేశంలో అడుగుపెట్టి అపశ్రుతి మ్రోయించలేదు గదా నేను? ఏదో సిగ్గు అలుముకుపోయింది.

మా గురువులు శిల్పార్ణవులు. ఆయనమోము హిమాలయశిఖరం లా శాంతిపూరితమైంది. ఆయన సాధారణంగా మాట్లాడరు. అనే నాలుగుముక్కలూ సూక్తాలై, సూత్రాలై ప్రత్యక్ష మవుతూ ఉంటవి.

చిన్నతనాన్నుంచీ చిత్రలేఖనాది కళలంటే చెలిమి కత్తెల్లా ఆడుకొంటూ ఉన్న నన్ను ఆ ఉత్కృష్ట విద్యలో సంపూర్ణ యోగనిష్ఠాపరిపూర్ణను చేయడానికై మాళవ మహారాజ్యభార ధౌరంధర్యులైన మాతండ్రిగారు, మహా మంత్రులు ఆనందవసువులవారు నన్ను ఈ ఆశ్రమానికి ఒక్క పవిత్రముహూర్తాన పంపించినారు. మా కుటుంబం అంతా వచ్చి మా నాయనగారు ఇదివరకే నిర్మించిన గుహా చైత్యాన్ని అలంకరింపించ ఆజ్ఞ యిచ్చినారు. అలంకారాదికాలన్నీ పూర్తికాగానే మహోత్సవంతో ఆశ్రమచార్యులకు సమర్పించాలని మా నాన్నగారి సంకల్పము.

ఆ గుహా విహారానికి ప్రాంగణమంటపము పూర్తి అయ్యింది. స్తంభాలు, శిల్పాలు, విగ్రహాలు, భిఖ్కులు

7