Jump to content

పుట:Bhagira Loya.djvu/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'

లైన శిష్యు లెవరయ్యా వారు?” అని పెద్ద గొంతుకతో అరచినాను.

ఆ వృద్ధ అంతట “అమ్మాయిగారు! లెండిపోదాము” అనుచుండ, నేను చెంగున ఆమె పైనుండి దాటి ఏదోగొణుగు కొంటూ వెళ్ళిపోయినాను. వాఘీరాశ్రమ సంఘాచార్యులైన సత్యశీల భిక్షాచార్యుల కడకు చేరుకొన్నాను. సత్యశీలాచార్యులు నూరేండ్ల వృద్ధు. సర్వశాస్త్ర సంపన్నుడు. ఇంతైనా వీడిపోని శక్తిసంపన్నుడైన ఆ మహాత్ముడు నన్ను ప్రక్కనున్న కుశాసనముపైన అధివసింపజేసి, “తండ్రీ! ఏమంత తొందరపాటుతో వస్తూన్నావు?” అని ప్రశ్నించాడు.

పవిత్రులైన ఆచార్యుల వారి పాదాలకు నమస్కరించి “భయంకరమైన ఒక విషయాన్ని తమకు చెప్పదలచుకొన్నాను. ఈ ఆశ్రమానికి ప్రథమంలో నేను వచ్చినప్పుడు నాకు రెండవ జీవితంలాంటి ఆశయాల్ని కొన్నిటిని తమతో మనవిచేసి, తమ ఆజ్ఞతో పరమశ్రమణకుడు నాకు ప్రసాదించిన ఈ నా కొద్దివిద్యను సంఘానికీ, లోకానికీ అర్పించాలని ఈ సంఘారామం ప్రవేశించాను.”

“అవును, ఆ ఆశయాలకు భంగం యేమి వచ్చింది తండ్రీ?”

“ఒక బాలికకు నేను చిత్రవిద్య నేర్పాలట, స్వామీ!”

“మాళవ మహామంత్రి ఆనందవసువు పాప మెరగని తన కుమార్తెకు నీచేత విద్య నేర్పించాలని ఆశించి తథా గతుని పాదంమ్రోల ఆశ్రయిస్తున్నాడు, బాబూ!”

10

'