పుట:Bhaarata arthashaastramu (1958).pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వతంత్ర సంశ్లేష

ఇపుడు జనులిచ్చవచ్చినట్లు వృత్తుల నవలంబింపవచ్చును. శిల్పులును నిచ్చ వచ్చినవారి కొలువులో జేరవచ్చును. పారతంత్ర్యం, అస్తమితముగాకపోయినను పడమటి దిక్కు వ్రాలియున్నది. స్వాతంత్ర్యము, ఉచ్చస్థానమున లేకున్నను, ఉదయాద్రినైన నెక్కినది.

మిక్కిలిగా జ్ఞానము స్వతంత్రతగలిగి మెఱయు దేశముల నార్థిక సంశ్లేషణము మొత్తము మీద నొడంబడికలచే గుదిరెడు. ఇట్లు స్వేచ్ఛమైగలసిన గుమికి నాయకులు మూల ధనము నిర్మాణశక్తియు గలిగిన యజమానులు. ఉద్యమములకు వలయుపాటు నొసంగువారు బేరమాడి కూలి నలవరించుకొని నిలుచు జీతగాండ్రు. స్వతంత్ర వర్తనా పరిశోభితంబు గావుననే యీ కాలమున ననిరుద్ధ స్పర్థ దీపించియుండుట.

స్వతంత్రత నేటికిని బరిపూర్ణస్థితికి వచ్చినదిగాదు. ఎట్లన, బీదలుగ నుండువారల నిర్బంధించి హీనవేతనములకుం బనిచేయు నట్లొనరించుటకు ఋషి ప్రోక్తములు, రాజప్రోక్తములునైన శాసనములు లేకున్నను కడుపాత్రమను క్రూరవిధి యున్నది. ఒక్క కడుపాత్రమేనా? అజ్ఞానమునున్నది. యజమానులతో సరినిలిచి నియమముల సేకరించుకొనవచ్చునను అనుమతియున్నజాలునా? శక్తియు నుండవలదా? స్వాతంత్ర్యము నకు సమత్వము ప్రధానము. సమత్వము లేనిదయ్యెనేని స్వాతంత్ర్యము పేరునకు నిలిచియుండునేగాని యాచరణ పాత్రంబుగాదు. పశ్చిమఖండములలో నీసమత్వము సర్వసాధారణముం జేయుటకై యనేకులు సాహసము గొనియున్నారు. వారిప్రయత్నములు క్రమముగ పండునకు వచ్చుచున్నవి.

సమత్వసిద్ధికై చేయబడిన యుపాయముల జర్చించుటకు నిది సమయము గాకపోయినను సూచనగ గొన్నింటినైన భావవైశద్యమునకై తెలుపుటమంచిది. అవియెవ్వియనిన:- సర్వజనులకు నిర్బంధ