పుట:Bhaarata arthashaastramu (1958).pdf/282

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కావుననె వారికి మనకుంగల తారతమ్య మత్యధికము. మనము వారలట్లుండుటకు నిది తరుణముగాదు. తాదృశ మార్గావలంబనకు దారిద్ర్యమొక నిరోధకముగా నుండును. మఱియు, ధాన్యమునమ్మి మనము కాలమును మిగిల్చితిమేని ఈకాలమును వ్యర్థపుచ్చక వినియోగించుటకు వారలయందుబలె మనలో శక్తియు, రక్తియు, యుక్తియు నవకాశమునులేవు.

గ్రామ్యపద్ధతి స్వాతంత్ర్యార్గళము

ఇంకను గ్రామ్యవ్యవహారలక్షణముల వెల్లడిసేతము. కులము, గ్రామము మొదలగు చిల్లరసమూహములే శరణమని యుండువారికి స్వతంత్రత సంపూర్ణముగ సున్న. ఎట్లనిన:-

ఎప్పు డెవరేరీతి నెత్తివత్తురోయను భయమున వడవడ వడకు చుండు పల్లెటూళ్ళలో సైన్యమునందుబలె ప్రతివాడును నియత పద్ధతులం బూనవలయుగాని స్వేచ్ఛావిహారుడౌట వొసగదు. "త్రిమూర్తులకన్న నల్పదేవతల యధికారము జాస్తి" యన్నట్లు సమూహమెంత చిన్నదియో దానిచే చెలాయింపబడు తనికీ యంత మిక్కుటము.

"గంగ పాఱుచుండు గదలని గతితోడ, ముఱికి కాల్వపాఱు మ్రోతతోడ" నని వేమన యానతిచ్చినట్లు ప్రధానమంత్రులకన్న గ్రామపంచాయతీదారులధాటి కడుదట్టము. కలకత్తాలోని గవర్నర్ జనరల్‌గారికి మన మేపోకలబోయిననేమి? మఱి మనచర్య లిటువంటివనియైన నెఱుగుదురా? ఎవరైన జెప్పవచ్చిన నాలకించుట కవకాశముగాని యభిలాషముగాని యుండునా? రాజశాసిత విధుల దీర్చినచో, దదితతముల నేమిచేసిన జేయకున్న వారికేమిచింత? ఊరి పెద్దలు కులపుబెద్దలును "పిట్టచిన్నదియైనను కూతపెద్దది" అన్నట్లు ప్రతివారి యంతరంగముల సైతము త్రవ్విత్రవ్విచూడ యత్నింతురు. సమీపస్థులును ఊరిలో బెద్దలును గావున కనులెంతదూరముపాఱునో