పుట:Bhaarata arthashaastramu (1958).pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

     చ. "స్థిరమగు పుణ్యకర్మమున దేవభవంబగు బుణ్యపాప సం
         కరమున మానుషత్వమగు గల్మషముల్ వశుకీటభావముం
         బొరయగజేయు................................" - భారతము

ఇట్టితత్త్వములు సంఘీభావదృష్టి లేశమైననులేక స్వప్రయోజనమే పరమార్థంబుగానెంచు కాపురుషుల యందుంగాక యింకెయ్యెడను నావిద్భవింపదనుట సులభముగ నిరూపింపబడియె. చూడుడు!

తనకర్మము తన్నే చెందుట నిజమైన వర్ణ ధర్మంబుల కనుగుణమగు వెఱపునంజనుట యుక్తంబనుట యేలకలిగె? వర్ణధర్మము లనగా వర్ణోద్ధారకధర్మములు. ఈ నడవడిచే నేరికి మేలు ఉద్దిష్టమయ్యె? తనకా? వర్ణమునకా? తనకనుట పొసంగుటెట్లు? శూద్రులు ద్విజ సేవలో మునింగియుండవలసిన వారట? ఈలోకమే నరకమౌనట్లు పరితపించుట మాలమాదిగలయొక్క ధర్మమట! అల్పసంఖ్యగల బ్రాహ్మణ క్షత్రియులుదక్క పెఱవారెవ్వరును ఈ ప్రపంచమున ముందునకు రాగూడదు! రాబ్రయత్నించుట మహాపాతకము!! రౌరవాది నరకావహము!!! అట్లగుట నీధర్మంబులు శూద్రాదుల కురిత్రాడులయ్యె. కావున జనసామాన్యమునకివి యుపకరించుననుట కల్ల. కొన్నివర్ణములవారి లాభార్థము స్పష్టములనుట యధార్థము.

కావున గర్మము తన్నుమాత్రము జెందుననుట యార్యులే నమ్మలేదని మాయభిప్రాయము. దాని ఫలములు సంఘముం బొందుననుట తెలిసికొనినవారయ్యు నగ్రజాతివారు తదితరులం దమ యధీన మందుంచికొనుటకై యీ మాయామయమగు తత్త్వముం బన్నిరి. ఎట్లనిన హీనకులస్థులకు స్మృతి విహితాచారములవలన హింసయేగాని సుఖములేదు. వారలారీతి బోడిమిసెడి సర్వదా యుండ వలయునన్న నింకేదైన నొక యాసజూపనిది సాధ్యముగాదు. ఈమిధ్యాలాభము స్థాపించుటకై కాబోలు "శరీరి కర్మవశగతిం" బోవుననిరి. ఈ కుటిలముయొక్క యంతరంగభావమేమనగా "ఓ నిర్భాగ్యులారా! మాకై ప్రయాసపడి చావుడు. ప్రత్యక్షముగనున్న ధనమును సుఖ