పుట:Bhaarata arthashaastramu (1958).pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదునాల్గవ ప్రకరణము

సమర్థత నతిశయింపజేయు మార్గములు

దేశముయొక్క అర్థార్జనశక్తి యుద్దీపించుటకు గారణము పూర్వోదిత ప్రకృతి శ్రమ మూలధనంబు లధికసమర్థము లగుటయే. ఏకదర్థం బేర్పఱుపబడిన విధానముల విశదీకరింతము.

ప్రకృతి

ప్రకృతిం గూర్చిన విషయములు కొన్ని మున్నే చర్చింప బడియె. స్వభావసిద్ధముల గణ్యతంబట్టిచూడ నిందు భూమి మొదటిది.

భూమి నెక్కువ ఫలవతిగా జేయుమార్గములురెండు. వైశాల్య సారాతిశయములను గల్పించుట.

సారాతిశయముంగూర్చి ముందేవ్రాసితి. ఇంకను విస్తరించుట కిది వ్యవసాయశాస్త్రముగాదు.

వైశాల్యాతిశయము ననుసంధించు పద్ధతులు రెండు:-

1. సముద్రముచే నాచ్ఛాదితములగు భూముల నాక్రమించు కొనుట. హాలెండుదేశస్థులు 'జైడరు' అను సముద్రశాఖను సేతువు గట్టి కొలనుగాజేసి పిమ్మట నానీటిని యంత్రములతో వెడలజల్లి శతసహస్ర సంఖ్యగల యెకరములభూమి సంపాదించిరి.

2. ఇంకను సాగుబడిక్రిందికిరానిభూములు సాగుబడికిదెచ్చుట. నేలలు దుక్కికిరామికి హేతువేమన్నను నీటిపాఱుదలలేమి, మితిమీఱినయూట, చవుడు, పొదలుబలిసికప్పివేయుట, అల్పజనసంఖ్య ఇత్యాదులు. ఈ దేశములో జనసంఖ్య యేనాటికిని కొఱతనొందదు. పంజాబులో గవర్నమెంటువారు అక్కడ బ్రవహించు నదులనీరు వ్యర్థముగ సముద్రమునకుంబోనట్లు కాలువల ద్రవ్వించి, వేలకొలది