పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నము లేక పోయెను. తడిసి, బురదలో నొక గంటవఱకు ప్రయాసపడి, తుదకు దోనెను తీయలేక, మరలివచ్చితి"నని బెంజమిను వ్రాసెను. "మా జేబులలో డబ్బులేదు, గాలికఱచుచున్నను, మేమొక గడ్డి కుప్పయొద్ద నా రాత్రి గడపుటకు నిశ్చయించితిమి. ఇటులు శ్రమదమలు పడుచుంటిమి. ఇంతలో మాలో నొకడు తన జేబులోనుండి యినుపలాడా (Horse-shoe) నుతీసి, దానితో దాళమును బగులగొట్టుటకు వీలగు నని నాతోజెప్పి, నాచేతికి దాని నిచ్చెను. నేను దానిని పట్టుకొని వెళ్లి, తాళమును బగులగొట్టి, దోనెను నీటిలో తేల్చితిని. మేమందఱము సంతోషించి, దానిలో నెక్కితిమి. నేను బట్టలను వేసికొనినపైని, దానిని మేము గడిపితిమి. పెద్దకష్టము ముందుకు రానున్నది. అప్పుడు పోటు సమయము గనుక, నంతట నీరు నిండియుండెను. వెన్నెలరాత్రియైనను, కయ్యనుండి పోవుకాలువ యేదోమాకు దెలియ లేదు. తోచినటుల దోనెను తిన్నగ గడిపినందున, సగముదూరముపోవు నప్పటికి, బురదలో దోనె చిక్కుపడినట్టు మాకు దోచెను. తెడ్డులను బురదలోనాటి, దోనెనునీటిలోనికి ద్రోయవలెననియత్నించి, మే మొక తెడ్డును విరిచివేసితిమి. నాలుగంగుళమునీరైన లేనందున, దోనెతో మే మొడ్డెక్కితిమి, ఏమిచేయుటకునుదోచక, చీకాకుపడుచుంటిమి. పాటో, పోటోమాకు తెలియలేదు. కొంత సేపటికి, పాటుసమయ మనిగ్రహించితిమి. తెడ్లు