పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్షుద్బాధాయుతుడై కడుడస్సి, నిదుర లేక నీరసించి, రేవులో బెంజమిను దిగెను. పట్టణమునకు బోవుచు, రొట్టెను బట్టుకొని వచ్చు బాలు నొకనిని దారిలోజూచి, వానివలన రొట్టె లమ్మబడు స్థలమునుగనుగొని, వెంటనేనక్కడకుబోయి మూడురొట్టెలనుగొని, వానిని తనజేబులలో బెట్టుకొనుటకు వీలు లేక, రెండు పొట్లములుగట్టి చంకక్రిందనుంచుకొని, మిగిలిన దానిని తినుచు, మార్కటు వీధిని బోవుచుండెను. ఇట్లు పోవుచు, రీడు ధొరగారి యింటిమీదుగ నతడు నడచుట తటస్థించెను. అప్పుడు ద్వారమువద్ద నిలుచుండిన 'కన్యకరీడు' బెంజమిను వైఖరినిజూచి, యాశ్చర్యమొందెను. ఈమెకు 18 సంవత్సరముల వయస్సు. ఈమె ముందుకు గృహిణిఫ్రాంక్లిను కాగలదు. కాని ఈమె చూపులను బెంజమిను గమనింపక 7000 వేల ప్రజాసంఖ్య కలిగి, ఉత్తమక్షేత్రగృహారామములతో వెలయుచున్న ఆ పట్టణమును విలోకించుచుబోయెను. వీధులన్నియు దిరిగి తిరిగి, రేవునకు వచ్చి, బెంజమిను తన దారిని నిరీక్షించుచున్న ముదుసలికి, దాని కుమారునకు, శేషించిన రెండు రొట్టెల నిచ్చివేసెను.

అక్కడినుండి తిరిగి వచ్చునపుడు, మార్కటు వీధిని బెంజమిను రాగా, దారిలో మతపరిషత్తునకు బోవు వారిని గలిసి, వారితో బోయి, సభలో గూర్చుండి, నిశ్శబ్దముగ నుండు