పుట:Bappadu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

20 అని చిరునవ్వును నవ్వుచు బప్పకు కదలి తోట దాటి వెళ్లి పోయెను. కనబడు చున్నంత సేపు పిల్లలు ఆ వై పే చూచుచు నిలువంబడి అటుపై మెల మెల్లగ చింత విడిచి ఉయ్యాల' నెక్కి ఊగగ సాగిరి. అట బప్పడు ఎటు ఆవు పోయెనో ఎరుగక మనమున పరిపరి విధముల తలపోయుచు, ఆవు నడక జాడల బట్టి చెట్ల నీడలు గల తోటల లోన ఉన్న బాటల' కడ్డముగా అల్లిబిల్లిగా అల్లుకొనినట్టి మల్లి మొల్ల విరజాజి తీగెలను మెల్ల మెల్ల తప్పించుకొనుచు, ఎటు చీమ చిటుక్కు' మటన్న తటుక్కున తిరిగి చూచి అటు ఆవు లేకున్న మనసు చివుక్కున పొక్కుచుండగా మనుజుల సంచారము మున్నెరుగని లోపు జీబు వనమునందు చొరబడి, అక్కడి పిట్టలు తపతప రెక్కలు కొట్టుకొని హఠాత్తుగ పై '

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Bappadu.pdf/22&oldid=344699" నుండి వెలికితీశారు