పుట:Bappadu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చూచుచున్న యంతలో నే తిరిగీ
దిట్టమైన గట్టి తాడు పట్టుక
వచ్చి, “ఇదిగో, తెచ్చితి నూ అరణము,
మరి ఇక ఆలస్యము చేయక డీ,
పెండ్లి ముహూర్తము మించిపో వచ్చే
పెండ్లి కొమార్తెలు కండీ వేగ మె”
అని చిరునవ్వును నవ్వుచు నిలిచెను.
ఆపై జరిగిన వేడు కె వేడుక.
అనందము ఆనందము ఆయెను:
శ్రీరాముని వంటి పెండ్లి కొడుకూ,
సీతమ్మ వంటి పెండ్లికూతులూ,
ఇక పటికి ఆనందము కలుగదు?
లక్ష్మీ కల్యాణము ఒక భాగ్యమె?
గౌరీక ల్యాణము సౌభాగ్యమె
ఇదియే భాగ్యము, ఇదె సౌభాగ్యము.
బంగరు బొమ్మల పెండ్లిండ్లుతరుచు
చేసే ఈడున ఉన్న ఆ చిన్ని
బంగరుబొమ్మల పెండ్లి ఎవ్వరికి
అనందము కలిగింపక ఉండును?
ఆ వేడుక చూడగ ముచ్చట పడి
గాలికి పై' కెగయుచున్న తీ గెలు
నిక్కి నిక్కి కనుగొనగా సాగెను.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Bappadu.pdf/14&oldid=344720" నుండి వెలికితీశారు