పుట:Bala Neethi.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5

బా ల నీ తి.

కెక్కువగా బ్రయత్నముజేసి భాగవతులని వాసిగాంచవలెను.

ఆ.వె. ఎన్నియెన్నిపూజ♦లెన్నిజేసిననేమి
       భక్తిలేనిపూజ♦ఫలములేదు
        భక్తికలుగుపూజ♦బహుళకారనముగా
        విశ్వదాబిరామ♦వినురవేమ!

మాతృభక్తి.


తల్లియందు భక్తిగానుండుటయే మాతృభక్తి యనబడును.

మనతల్లి మనలను బదిమాసములుమోసి పలు బాధల కోర్చి వచించరానికష్టములబడి కనును. కనినది మొదలు మనయొక్క మూత్రపురీషాదులను గడిగి బహు జాగ్రత్తతొ మనల గాపాడుచుండును. మనప్రాణములను దమయరచేతిలో నిడుకొని పోషించుచుండును. మనలను. మనలను గ్రిందుగ విడిచిన బిల్లిమ్రింగుననియు, బైనిబెట్టిన బక్షి తన్ను కొనిపోవుననియు బెంగపడుచు బ్రీతితొ బెంచుచుండును. మనలను కన్న తండ్రి యసహ్యీంచుకొనినను గన్నతల్లిమాత్రమటు లసహ్యించుకొనక దగ్గఱకుదీసికొని తనయొడిలో గూర్చుండబెట్టుకొని బుజ్జగించుచు ముద్దులాడు చుండును మనవలన నెటువంటితప్పులు వచ్చినను భరించునది తల్లియే