పుట:Bala Neethi.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
2

బా ల నీ తి.

లమందనుభవించెడిసిలుగుల బాసి సుకము జేకూర్చుటను, మఱియు నాయన, మననాయనవలె దినుటకన్నమును, గట్టుటకుబట్టలును నిచ్చి యల్లారు ముద్దుగా గాపాడుటను, మనమే పనినిప్రారంభించినను దానికనేకవిధముల సాయముజేసి సఫలముగా నొనరించుటచేతను, మనకు జగముననుండు వస్తువులనెల్ల జూచుటకు గన్నులును, నడచుటకు గాళ్ళును, గర్మమ్లనారంభించిటకు గరములును, విమర్శనమొనరించిటకు బిద్ధియును, గీర్తించుటకు వాక్కును, మఱియు బహువిధోపయోగంబులగు బహ్వవయవముల నిచ్చుటవలనను, నాపరమ దయాళుని దప్పక సేవించవలెను.

మనమాభగవంతుని సేవించుటయెట్లన? మనము ప్రతిదినము దెల్లవాఱుజామున నాలుగు గంటలకు మేల్కొంచి దంతధావనాది కృత్యంబుల నిర్వర్తించుకొని విమలజలమున స్నానమాచరించి ముఱికిలేని బట్టలగట్టి శుచికలవారమై "చిత్తము శివునిమీద భక్తిమఱియెచ్చటనో" యున్నట్లుండక మనమనస్సును వాక్కును, శరీరమును, గర్మమును, నీనాలుగు నొకచోజేర్చి సంభవస్దితిలయ హేతుభూతుడగు నప్పరమేశ్వరుని, "నే దెలియక చేసినపాపపుబనులను, దెలిసియుజెసిన పాపపు బనులను నామొఱనాలకించి నన్ను మన్ననతో మన్నించవలయు" నని కోరి ధ్యానించవలెను. మఱియు బూజాదుల నాపరమాత్ముని సేవింపవలెను. మనము భక్తిలేక యెంతగొప్పగా బూజ జేసినను బ్రయోజనములేదు. "భక్తి