పుట:Bala 1945 10 01 Volume No 01 Issue No 03 080 P.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


[శ్రీ వే. కోదండరాములు గారివద్ద చింతా దీక్షితులు వ్రాసుకొన్న పాట]


తెల్లవారి లేచింది, చిట్టెలుకా

కాళ్ళు మొహం కడిగింది, చిట్టెలుకా

పట్టెనామం పెట్టింది, చిట్టెలుకా

పల్లెత్రోవ పట్టింది, చిట్టెలుకా

ఉల్లిగడ్డ కొరికింది, చిట్టెలుకా

ఊరిత్రోవ పట్టింది, చిట్టెలుకా!