పుట:Bala 1945 10 01 Volume No 01 Issue No 03 080 P.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇండ్ల కథ

ఇంక ఎడారి దేశాల్లో ఏమిటో తెలుసా! అక్కడ ఇసుక ప్రదేశాల్లో ఇళ్ళు కట్టుకోలేరు. అందుచేత వాళ్లు డేరాలు వేసుకుని అందులోనే ఉంటారు.

మరో చిత్రం చూశారా! మంచు దేశాల్లో ఎస్కిమోల నే జూతి వాళ్లు 'ఇగ్లూ' అని గుండ్రంగా వున్న ఇళ్లు కట్టుకుని అందులో వుంటారు. బొమ్మలో చూడండి ఆయిల్లు ఎలాగుంటుందో!

ఎప్పుడేనా గాలీవానవస్తే గడ్డళ్ళూ తాటాకు ఇళ్ళూ, ఎగిరిపోతాయి. పొరపాటున నిప్పంటుకుంటే, నిమిషంలో కాలిపోతాయి. అందుచేత కొందరు ఏం చేశారంటే ఇటికలూ, పెంకులూ కనిపెట్టేరు.

ఇటికతో కట్టిన ఇళ్లు దిట్టంగా వుంటాయి. . . అంతకన్నా గట్టిగా ఉండాలని గొప్పవాళ్ళు రాతితో గొడలు పెట్టి ఇళ్లు కట్టుకుంటున్నారు. మనపల్లెటూళ్లలో వాళ్లు ఇప్పటికీ గడ్డిళ్లే కట్టుకుంటున్నారు. కాని పట్టణాలలో పెంకుటిళ్ళు, మిద్దెఇళ్ళు, మేడ ఇళ్ళు, రెండంతస్థుల మేడలు, బంగళాలు ఇలాగ అనేకరకాల ఇళ్ళు లేచేయి.

న్యూయార్కు అనే పట్టణం అమెరికాలో వుంది. అవూళ్ళో ఇళ్ళు కట్టుకోడానికి దిగువున స్థలంచాలక, పెద్ద పెద్ద 50 అంతస్తులు, 60 అంతస్తుల మేడలు కూడా కట్టేస్తునారు. చూశారా, ఎన్నెన్ని విధాలుగా ఉన్నాయో!