పుట:Ashoka-Chakravarti-Dharmashaashanamulu.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

అశోకుని ధర్మశాసనములు.


సంస్కృతము

(1) దేవా నాంప్రియః ఆజ్ఞాపయతి [2] కౌసాంబ్యాం మహామాత్రా
వ వో సముగ్యిం కృతమ్‌ [4] సంఘస్య న లభ్య తే.. .సంఘం భనక్తి
భిక్సుకో వా భిక్రుణీ నా తే సి చావదాతాని దూష్యాణి సన్నిథాప్యా
నావాన మావా సయితవ్యః.

తెనుగు.

(1) జేవానాంప్రియ డాజ్ఞాపించుచున్నాండు. [2] కొసాంబి
యందలి మహామాత్రులు .. సంపూర్ణము. చేయ బడినది.. (4) సంఘ
మునకుపొందండు .. భిక్షకుండుగాని, భిక్షుణిగాని సంఘమును
విడదీసిన యెడల వారికి దూష్యములైన తెల్లనిబట్టలను కట్టి మఱియొక
స్థలమునకు వంపి వేయవలయును.

సాంచీ స్తంభము

సాంచీ గ్రామము మధ్యయిండియాలోని భూపాల్‌ సంస్టానమునం
దు భీల్సాకు మైళ్ళదూరములోను, సాంచీ రైలు ష్టేషనుకు ముప్పా
వుమైలుదూరములోను నున్నది. ఈ అశోకునిస్తంభము పూర్వము
మిక్కిలిపొడువుగానుండిన పెద్దస్తంభములోని యొక ఖండ మైయున్నది.
ఈస్తంభముయొక్క- పైభాగమున నాలుగు సింహముల విగ్రహములు
చెక్కబడియున్నవి.ఈ శాసనములోని మొదటిభాగము పోయినది.
మిగిలినదానిలోని మొదటీ పంక్తి చాలా చెడియున్నది.